పవన్ గురించి ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-జనసేన కలిసి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీల పొత్తుపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024లోనే కాదు.. 2029లోనూ జనసేనతో కలిసి పనిచేస్తామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అని స్పష్టం చేశారు. తమ పథకాలకు స్టిక్కర్లు వేసి.. [&hellip;]</p>

BJP leader GVL, Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-జనసేన కలిసి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీల పొత్తుపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024లోనే కాదు.. 2029లోనూ జనసేనతో కలిసి పనిచేస్తామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అని స్పష్టం చేశారు. తమ పథకాలకు స్టిక్కర్లు వేసి.. తమపైనే ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంతలాభం కోసమే బీజేపీ నుంచి టీడీపీ విడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story