హిందువుల కోసం బరాబర్ కొట్లాడతాం

by  |
హిందువుల కోసం బరాబర్ కొట్లాడతాం
X

“బిడ్డా…నీ పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. రోహింగ్యాలను, పాకిస్తానీయులను తరిమితరిమికొడతాం. మెజారిటీ హిందువుల కోసం బరాబర్ కొట్లాడతాం. జీహెచ్ఎంసీ ఎన్నికలే అయినా ఇది దేశభక్తులకు, దేశ ద్రోహులకు మధ్య జరుగుతున్న యుద్ధం. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా స్పందించని మానవ మృగం మన ముఖ్యమంత్రి. వందలాది మంది విద్యార్థులు, యువత ఆత్మ బలిదానాలమీద ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు మూర్ఖపు ముఖ్యమంత్రి చేతుల్లో బందీ అయింది. ప్రగతిభవన్ గడీలను బద్దలు కొట్టి రోడ్లమీదకు తీసుకొస్తాం” అని బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియాలో ఎగరబోయేది కాషాయా జెండాయేనని, డిసెంబరు నాలుగున భాగ్యలక్ష్మి ఆలయం దగ్గరే విజయోత్సవ సభ జరుగుతుందని సంజయ్​స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. 12 శాతం ఓట్లు ఉన్నచోట నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలిస్తే ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80 శాతం మంది హిందువులు ఉన్నచోట బీజేపీ ఎన్ని సీట్లు గెలవాలని ప్రజలను బండి సంజయ్ ప్రశ్నించారు. 40 మంది బీసీలు గెలవాల్సిన చోట మజ్లిస్ గెలిచిందని. దీన్ని అడ్డుకోవాలన్నారు. మెజారిటీ ప్రజల కోసం బరాబర్ కొట్లాడతామని, ఆకుపచ్చ జెండాను, పింక్ జెండాను తరిమికొట్టడం ఖాయమని అన్నారు. బీజేపీని మతతత్వ పార్టీ అని ఆ రెండు పార్టీలు అంటున్నాయని, హిందువుల మనోభావాలు, హిందు ధర్మం కోసం కొట్లాడి లోక కల్యాణం కోసం పనిచేసే నిఖార్సయిన హిందు పార్టీ అని సమర్ధించుకున్నారు. రోజుకో పండుగ, రోజుకో దేవుడు అంటూ హిందు ధర్మం గొప్పదనాన్ని చీల్చడానికి, అవమానపర్చడానికి ప్రయత్నం చేస్తే వారి గడీలను, అహంకారాన్ని బద్దలుకొడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పచ్చ జెండాను తరిమికొట్టే ఏకైక పార్టీ కాషాయ జెండా అని ప్రకటించారు. ఉగ్రవాదులకు శవయాత్రలను, సంతాప సభలు నిర్వహించే మజ్లిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా వ్యతిరేకించేదని, అలాంటి దేశ ద్రోహ పార్టీతో టీఆర్ఎస్ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందన్నారు.

ఇక్కడ దెబ్బ కొడితే..

దుబ్బాకలో గెలిస్తే జీహెచ్ఎంసీ ప్రజలపై కేసీఆర్‌కు ప్రేమ పుట్టుకొచ్చిందని, ఇక్కడ దెబ్బ కొడితే రాష్ట్రంమీద అక్కర తెలిసొస్తుందని సంజయ్​ అన్నారు. ఏనాడూ గడీ దాటని ముఖ్యమంత్రి ఇక ప్రజల మధ్యకు రావాల్సి వస్తుందన్నారు. అందుకే దుబ్బాక గెలుపు లాగనే జీహెచ్ఎంసీలో కూడా కాషాయం పార్టీని గెలిపిస్తే గడీల పాలనకు చరమగీతం పాడవచ్చన్నారు. అబద్ధాలు ఆడనని, మెడకాయమీద తలకాయ అనే సామెతను గుర్తుచేస్తున్న సీఎం కేసీఆర్ డబుల్ ఇండ్లు, నిరుద్యోగ భృతి లాంటి ఎన్నో విషయాల్లో అన్నీ అబద్ధాలే చెబుతున్నారని అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా తాను తీసుకుంటానన్నారు. కేటీఆర్ తనకు 50 ప్రశ్నలు వేస్తున్నారని, అనేక రకాలుగా నష్టపోయిన ప్రజలు వేసే ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొండగట్టు బస్సు ప్రమాదం మొదలు కరోనా, వరదలు, రైతుల ఆత్మహత్యలు, ఆర్టీసీ కార్మికుల ఆకలి చావులు… ఏ సందర్భంలోనూ ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌ను, ఫామ్ హౌజ్‌ను విడిచి బైటకు రాలేదని విమర్శించారు. గల్లీ పార్టీ కావాలా లేక ఢిల్లీ పార్టీ కావాలా అని ప్రజలను రెచ్చగొడుతున్నారని, నిజానికి గల్లీ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ గడీలకు పరిమితమైందని, ఢిల్లీ పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు గల్లీల్లోకి వచ్చి కరోనా, వరదల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉందని అన్నారు. వరదల సమయంలో బాధిత కుటుంబాలకు బిచ్చం లాగా పది వేల రూపాయలను ఇచ్చి బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని, బీజేపీ గెలిచిన తర్వాత తలా పాతిక వేల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేస్తుందని హామీ ఇచ్చారు.

ఎల్ఆర్ఎస్​ పేరుతో..

పది వేల రూపాయలు ఇచ్చి ఎల్ఆర్ఎస్ పేరుతో టీఆర్ఎస్​వేలాది రూపాయలను కొల్లగొడుతోందని సంజయ్​ఆరోపించారు. మళ్లీ ఆ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ తెచ్చి సామాన్య ప్రజలను అప్పులపాలు చేస్తుందన్నారు. ఆ ప్రమాదాన్ని గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ పోవాలని, అది జరగాలంటే బీజేపీ రావాలన్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీల పాలనను చూశారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కిలో బియ్యానికి రాష్ట్రం రూపాయి ఇస్తే… మిగిలిన రూ.29.60 కేంద్రం ఇస్తోందని, ఒక్క రూపాయికి ఓటేస్తారా లేక రూ.29.60కి ఓటేయాలా అనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండు లక్షల ఇండ్లను కాషాయ పార్టీని మంజూరు చేసి రూ.3,500 కోటలు ఇచ్చినా, రాష్ట్రం డబుల్ ఇండ్లను కట్టివ్వలేదన్నారు. డబుల్ ఇండ్లు రావాలంటే బీజేపీ రావాల్సిందేనన్నారు. బియ్యం, ఎల్ఈడీ లైట్లు, రోడ్లు, చెట్లు, మోరీలు, కమ్యూనిటీ హాళ్లు చివరకు శ్మశానవాటికలకు వస్తున్న పైసలన్నీ కేంద్రానివేనని, కానీ యాస, భాష, సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ మోసం చేస్తోందన్నారు.

దొంగ సంతకంతో గందరగోళం..

వరద సాయాన్ని ఇవ్వకుండా తాను లేఖ రాసినట్లు టీఆర్ఎస్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. తన నిజాయితీని నిరూపించుకోడానికి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేస్తే రాకుండా ఎగ్గొట్టిన సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో పడుకున్నారని ఆరోపించారు. “నగరంలో పేదలపై పన్నులు వేసి ప్రభుత్వం సంపాదించిన ఆస్తి ఎంత? తిరిగి ప్రజల కోసం నగరంలో ఖర్చు పెడుతున్నదెంతో సీఎం లెక్క చెప్పాలి. రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం భాగ్యనగరం నుంచి వస్తే రూ. 67 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. అవినీతి, నికృష్ణ, నియంత ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. భాగ్యలక్ష్మి ఆలయానికి ఎందుకు పోవాల్సి వచ్చిందని తనను ప్రశ్నిస్తున్నారని, అక్కడి వెళ్తే ఇండియా పాకిస్తాన్ లొల్లి అవుతదంటూ అడ్డుకున్నారని బండి సంజయ్ గుర్తుచేశారు. భాగ్యలక్ష్మి ఆలయం లేదా పాతబస్తీ పాకిస్తాన్ అని భావిస్తే ఈ నగరంలో అనేక చోట్ల మినీ పాకిస్తాన్, మినీ బంగ్లాదేశ్, మినీ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలు ఉన్నాయని, వాటిని తీసేసి భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. 15 నిమిషాలు సమయం ఇస్తే అంతు తేలుస్తాం అన్న పార్టీతో కేసీఆర్ అంటకాగుతున్నారని, లవ్ జిహాద్ పేరుతో మోసం చేస్తున్న మజ్లిస్ పార్టీతో చెట్టాపట్టాల్ వేసుకుంటున్నారని, ఆ రెండు పార్టీలను తరిమికొట్టే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.

తెలంగాణను విముక్తం చేయాలి

మూర్ఖపు ముఖ్యమంత్రి చేతుల్లో బందీ అయిన తెలంగాణను బంధ విముక్తి చేయాలని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు కమలం పార్టీ యుద్దం ప్రారంభించిందని సంజయ్​ అన్నారు. ఆ పవిత్ర యుద్ధంలో ప్రతీ ఒక్కరూ శపథం తీసుకోవాలని, గడీల పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రచారానికి వచ్చినప్పుడు ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారం కోసం నిలదీయాలన్నారు. సీఎం వల్లనే ప్రజల ప్రాణాలకు, భద్రతకు గ్యారంటీ లేకుండాపోయిందన్నారు. ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న ఉస్మానియా విద్యార్థుల సమస్యలను తెలుసుకోలేదని, ఇప్పుడు బీజేపీ యువమోర్చా నాయకుడు వెళ్తే పోలీసులు ముండ్ల కంచెలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. పోలీసులు. అరెస్టు చేస్తే, లాఠీ ఛార్జి చేస్తే ప్రగతి భవన్ గడీలను బద్దలుకొట్టి సీఎంను రోడ్డు మీదకు లాగుతామని హెచ్చరించారు.


Next Story

Most Viewed