- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళ్ హీరోయిన్‌పై దేశద్రోహం కేసు.. బీజేపీ డిమాండ్
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : తమిళ నటి ఒవియా హెలెన్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విషయానికొస్తే.. ఫిబ్రవరి 14న ప్రధానమంత్రి మోడీ తమిళనాడులో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు సోషల్ మీడియాలో ‘మోడీ గో బ్యాక్’ నినాదాలతో ట్రెండ్‌కు తెరతీశారు. ఈ క్రమంలో ఒవియా కూడా ‘మోడీ గో బ్యాక్’ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తూ ట్వీట్ చేసింది. దీంతో తమిళనాడు బీజేపీ నాయకులు […]</p>

X
దిశ, సినిమా : తమిళ నటి ఒవియా హెలెన్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విషయానికొస్తే.. ఫిబ్రవరి 14న ప్రధానమంత్రి మోడీ తమిళనాడులో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు సోషల్ మీడియాలో ‘మోడీ గో బ్యాక్’ నినాదాలతో ట్రెండ్‌కు తెరతీశారు. ఈ క్రమంలో ఒవియా కూడా ‘మోడీ గో బ్యాక్’ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తూ ట్వీట్ చేసింది. దీంతో తమిళనాడు బీజేపీ నాయకులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. తన ట్వీట్ వెనుక కుట్ర దాగి ఉందని, లోతుగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తనపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరుతున్నారు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1తో ఫేమస్ అయిన ఈ కేరళ భామ.. తమిళ్‌లో హీరోయిన్‌గా చేసింది. తెలుగులోనూ హీరో తరుణ్‌తో కలిసి ‘నా లవ్ స్టోరీ’ చిత్రంలో నటించింది.
Next Story






