- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ పాలనపై అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు
<p>లక్నో: బీజేపీ ప్రభుత్వం పాలన తీరుపై సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మధురలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుత బీజేపీ పాలన రోడ్డు ప్రారంభోత్సవంలో కొబ్బరి కాయ కొట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ‘పాత సంప్రదాయం ప్రకారం రోడ్లపై కొబ్బరి కాయలు కొడితే పగిలేవి. కానీ కొత్త సంప్రదాయంలో కొబ్బరికాయలు కొడితే రోడ్లే పగులుతున్నాయి’ అని అన్నారు. […]</p>

లక్నో: బీజేపీ ప్రభుత్వం పాలన తీరుపై సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మధురలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుత బీజేపీ పాలన రోడ్డు ప్రారంభోత్సవంలో కొబ్బరి కాయ కొట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ‘పాత సంప్రదాయం ప్రకారం రోడ్లపై కొబ్బరి కాయలు కొడితే పగిలేవి. కానీ కొత్త సంప్రదాయంలో కొబ్బరికాయలు కొడితే రోడ్లే పగులుతున్నాయి’ అని అన్నారు.
కాగా కొన్ని రోజుల క్రితం బినోజ్ సర్దార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుచి చౌదరీ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టగా రోడ్డు బీటలు వారింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అధికారులపై విచారణకు ఆదేశించింది. దాదాపు రూ.1.16కోట్లతో 7 కిలోమీటర్ల రోడ్డు వేశారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి అభివృద్ధితో 400 సీట్లలో బీజేపీ ఓటమి పాలవడం ఖాయమని అఖిలేష్ అన్నారు.






