ఏపీ డీజీపీకి సోము వీర్రాజు వార్నింగ్

85

దిశ, వెబ్‌డెస్క్ : రామతీర్థ ఆలయంలోని విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. డీజీపీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ సోమువీర్రాజు ఓ లేఖ రాశారు.

విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ కార్యకర్తల పాత్ర లేదని, దోషులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై డీజీపీ వివరణ ఇవ్వకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ వెళ్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..