ఈ విజయం బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌కు అంకితం

by Shyam |   (  Updated:2020-11-10 04:59:55  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు కార్యకర్తలదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌కు అంకింతం చేస్తున్నట్లు ప్రకటించారు. రఘునందన్‌రావు విజయం ఖరారు అయిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ప్రజలు చైతన్య వంతులని, బీజేపీ విజయం కోసం కృషిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇప్పటి నుంచి కేసీఆర్‌కు చుక్కలు చూపెడుతామన్నారు. రాష్ట్రంలో రజాకారుల పాలనకు చరమగీతం [&hellip;]</p>

ఈ విజయం బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌కు అంకితం
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు కార్యకర్తలదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌కు అంకింతం చేస్తున్నట్లు ప్రకటించారు. రఘునందన్‌రావు విజయం ఖరారు అయిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ప్రజలు చైతన్య వంతులని, బీజేపీ విజయం కోసం కృషిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇప్పటి నుంచి కేసీఆర్‌కు చుక్కలు చూపెడుతామన్నారు. రాష్ట్రంలో రజాకారుల పాలనకు చరమగీతం పాడుతామని వెల్లడించారు.

Next Story