బండి సంజయ్ కి షాక్.. ఆ ఫ్లెక్సీలను చించేస్తున్న కార్యకర్తలు

79
flexy

దిశ ,అదిలాబాద్ : ఈ నెల 17న నిర్మల్ జిల్లాలో అమిత్ షా పర్యటనకు రానున్న సందర్భంగా ఓ పారిశ్రామికవేత్త ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి.. స్వాగత ఫ్లెక్సీ లను జిల్లా కేంద్రంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చిత్రాలు ఉన్నాయి . బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ చిత్రాలు లేకపోవడంతో స్థానిక కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. జిల్లా కేంద్రంలో పారిశ్రామికవేత్త శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించారు. ప్రోటోకాల్ పాటించకుండా రాష్ట్ర , జిల్లా అధ్యక్ష ఫోటోలు ఏర్పాటు చేయకపోవడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

bjp activists

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..