సిద్ధిపేటకు కాషాయనేతలు.. ఆ డబ్బు ఎక్కడిది..?

603

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక బై ఎలక్షన్స్‌ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉంటున్న రఘునందన్ రావు మామా అయిన రాంగోపాల్‌ రావు ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, బీజేపీ కార్యకర్తల నడుమ వాగ్వాదం జరిగింది.

అయితే, పోలీసుల చేతిలో ఉన్న రూ. 18.65 లక్షలను బీజేపీ కార్యకర్తలు లాక్కున్నారు. కావాలనే డబ్బులను తీసుకొచ్చిన పోలీసులు రాంగోపాల్ రావును ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులకు దారీ తీసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా, నగదును రాంగోపాల్ రావు ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నా.. బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి ఉద్రిక్తతల నడుమ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సిద్దిపేటకు బయల్దేరారు. కాగా, అంతకుముందే బండి సంజయ్ కూడా సిద్దిపేటకు చేరుకొని జరిగిన సంఘటన పై ఆరా తీస్తున్నారు. దీంతో వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.