‘షీర్‌కుర్మా’పై ముస్లిం బైసెక్సువల్ మహిళ లాంగ్ నోట్

by  |
sheer-qoorrma
X

దిశ, సినిమా : ఒక సాధారణ మహిళ, మరో బైసెక్సువల్ మహిళకు మధ్య ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘షీర్‌కుర్మా’. ఫరాజ్ అరిఫ్ అన్సారీ డైరెక్ట్ చేసిన సినిమాలో స్వరా భాస్కర్, దివ్య దత్తాతో పాటు షబానా అజ్మీ నటించారు. తాజాగా అమెరికాలో నివసిస్తున్న ముస్లిం మహిళ ఒకరు.. ఈ మూవీ చూసి ఉద్వేగానికి గురై, డైరెక్టర్‌కు లాంగ్ నోట్‌ సెండ్ చేసింది. మొదట షేర్‌కుర్మా చిత్రాన్ని తీసినందుకు దర్శకుడికి ధన్యవాదాలు తెలిపిన ఆమె.. తను ఒక బైక్సువల్ ముస్లిం మహిళను అని, 39 ఏళ్గుగా దాచుకున్న విషయాన్ని సినిమా చూసిన తర్వాతే తల్లికి చెప్పగలిగానని వెల్లడించింది. ఈ మూవీ గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదని, గుండె బరువెక్కిందని గుర్తుచేసుకుంది.

‘మా అమ్మకు ఈ విషయం చెప్పినపుడు కంగారుపడింది. అయితే షీర్‌కుర్మా సినిమా చూడమని చెప్పాను. ఒకవేళ అమెరికాలో ప్రీమియర్ అయితే ఇద్దరం వెళ్లి చూస్తాం. మీకు ఏ విధంగా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే మీ సినిమా నా జీవితాన్ని సమూలంగా మార్చింది. అల్లాహ్.. మీకు, మీ టీమ్‌కు మరింత శక్తినివ్వాలని కోరుకుంటున్నా. మీకు పెద్ద అభిమానిగా మారిపోయా’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది. ఈ పోస్టుపై స్పందించిన డైరెక్టర్ ఇదే మాకు బిగ్గెస్ట్ అవార్డ్ అని.. ఈ సినిమా ‘సైరా, సితార, అమ్మీ’ వంటి ఎంతోమందికి అంకితమని ప్రకటించాడు.

Next Story

Most Viewed