టీకా వేయించుకుంటే బిర్యానీ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

by  |
టీకా వేయించుకుంటే బిర్యానీ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. కరోనా నియమాలను జాగ్రత్తగా పాటిస్తున్నా ఎంతోమంది కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుంది. అయితే టీకా మీద అపోహలతో చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ క్రమంలో వారి అపోహలను పోగేట్టేందుకు ఏపీలో టీకా ఉత్సవం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవంలో పలు రెస్టారెంట్లు సైతం పాల్గొని ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాయి.

టీకా ఉత్సవ్ లో పాల్గొని టీకా వేసుకుంటే బిర్యానీ ఫ్రీ అంటూ ఒక రెస్టారెంట్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటీకే టీకా వేసుకొంటే ముక్కుపుడక ఫ్రీ, బీర్లు ఫ్రీ అని కొన్ని రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు బంపర్ ఆఫర్లను ప్రకటించిన విషయం విదితమే. అలాగే ఇక్కడ కూడా టీకా వేసుకుంటే బిర్యానీ ఫ్రీ అంట. అయితే ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే.

ఏప్రిల్ 11 నుండి 14 వరకు టీకా వేసుకున్నవారికి తిన్నంత బిర్యానీ ఫ్రీ అంటూ హలో కిచెన్ అనే సంస్థ ఆఫర్ ప్రకటించింది. కాకినాడ, విజయనగరంలో ఉన్న బ్రాంచ్ ల్లో వ్యాక్సిన్ తీసుకొని బిర్యానీ ఫ్రీ గా తినొచ్చు అని తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం టీకా మీద అపోహలు మాని వ్యాక్సిన్ తీసుకొని ఫ్రీ బిర్యానీ కుమ్మేయ్యండి.

Next Story

Most Viewed