కేక్ కట్ చేసిన బర్త్ డే బాయ్.. అనూహ్యంగా అరెస్టు!

by  |
కేక్ కట్ చేసిన బర్త్ డే బాయ్.. అనూహ్యంగా అరెస్టు!
X

దిశ, వెబ్‌డెస్క్ : బర్త్ డే అంటే కొందరికి జీవితంలో మర్చిపోలేని రోజు. అందరితో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. కొందరైతే థ్రిల్లింగ్ కోరుకుంటారు. అందుకోసం కొత్తగా ఆలోచిస్తారు. కొందరు కొండ ప్రాంతాలు, బీచ్‌లకు వెళ్లి స్నేహితులతో కలిసి జాలీగా ఏంజాయ్ చేస్తారు. మరికొందరు సాదాసీదాగా జరుపుకుంటారు. అయితే బర్త్ డేను మనం ఊహించిన దానికంటే ఎక్కువ థ్రిల్లింగ్‌గా జరుపుకోవాలని భావించేవారు చాలా మంది ఉంటారు. కానీ, వారికి థ్రిల్లింగ్‌ అనేది కొత్తగా కష్టాలు కూడా తెచ్చి పెట్టే అవకాశం కూడా ఉంది. అలాంటి ఘటనే నాగ్‌పూర్‌లో వెలుగుచూసింది.

19 ఏళ్ల నిఖిల్‌ పటేల్‌ అక్టోబర్‌ 21న తన పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకోవాలనుకున్నాడు. అందరినీ పిలిచి పార్టీ ఏర్పాటు చేశాడు. మధ్యలో వచ్చిన నిఖిల్‌ స్నేహితులు నాలుగు పెద్ద కేక్‌లను అరేంజ్‌ చేశారు. సాధారణంగా ఆ కేకులను కత్తితో కట్‌చేస్తే సరిపోయేది.. కానీ, మన బర్త్ డే బోయ్ ఇక్కడే కాస్త అతిగా ప్రవర్తించాడు. కేక్‌ను కత్తితో కట్‌చేస్తే మజా ఎలా ఉంటుందని.. లోపలికి వెళ్లి ఖడ్గం తెచ్చి కట్‌ చేశాడు. నిఖిల్‌ చేసిన పనిని అతని స్నేహితులు ఫోటోలు తీసి వాట్సప్‌లో షేర్‌ చేశారు. సోషల్‌ మీడియాలో అది కాస్త వైరల్‌గా మారడంతో పోలీసుల దృష్టిలో పడ్డాయి. దీంతో వారు నిఖిల్‌ ఇంటికి వెళ్లి మారణాయుధాల చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.


Next Story