విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ… మూతపడుతున్న ఫౌల్ట్రీ పరిశ్రమలు

by  |
విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ… మూతపడుతున్న ఫౌల్ట్రీ పరిశ్రమలు
X

దిశ,వెబ్‌డెస్క్:కేరళ,మధ్యప్రదేశ్,రాజస్థాన్,గుజరాత్,హర్యానా రాష్ట్రాలు బర్డ్ ఫ్లూతో విలవిల్లాడుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఉత్తర్ ప్రదేశ్ కూడా వచ్చి చేరింది. దేశంలోనే నిన్న ఒక్కరోజే బర్డ్ ఫ్లూ వల్ల 1200పక్షులు మృత్యువాత పడ్డాయి. మరోవైపు దేశంలో రోజురోజుకి బర్డ్ ఫ్లూ కేసులు పెరిగిపోతుండడంతో కేంద్రం అన్నీ రాష్ట్రాలకు హైఅలెర్ట్ ఆదేశాల్ని జారీ చేసింది. పక్షుల నుంచి ఫ్లూ మనుషులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఢిల్లీతో పాటు జమ్ము- కశ్మీర్ లో ఫౌల్ట్రీ మార్కెట్లను క్లోజ్ చేయగా.., పశ్చిమ మధ్య భారత్ తో పాటు దక్షిణాది కేరళ ఫౌల్ట్రీతో పాటు బాతులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఏడు రాష్ట్రాలకే పరిమితమైన బర్డ్ ఫ్లూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు వ్యాపించే అవకాశం ఉంది. అందుకే కేంద్రం సైతం దేశంలోని అన్నీ రాష్ట్రాల ప్రజలకు బర్డ్ ఫ్లూ గురించి జాగ్రత్తలు చెబుతూ అప్రమత్తం చేస్తోంది.


Next Story

Most Viewed