బిపిన్ హ్యాట్రిక్ గోల్స్.. ముంబయి సిటీ ఘన విజయం

by  |
బిపిన్ హ్యాట్రిక్ గోల్స్.. ముంబయి సిటీ ఘన విజయం
X

దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా బుధవారం రాత్రి జీఎంసీ స్టేడియంలో ఒడిషా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి సిటీ 6-1తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడినా కసితో ఉన్న ముంబయి ఆటగాళ్లు గోల్స్ చేయడానికి పోటీలు పడ్డారు. బిపిన్ సింగ్ ఏకంగా హ్యాట్రిక్ గోల్స్ చేసి రికార్డు సృష్టించాడు. టాస్ గెల్చిన ముంబయి సిటీ కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. ఆట ప్రారంభమైన 9వ నిమిషంలోనే ఒడిషాకు పెనాల్టీ లభించింది.

డియాగో మారికో ఎలాంటి తప్పు చేయకుండా గోల్ చేయడంతో ఒడిషాకు 1-0 ఆధిక్యంలోకి దూసుకొని పోయింది. 38వ నిమిషంలో బిపిన్ సింగ్ గోల్ చేయడంతో స్కోర్ 1-1గా సమం అయ్యింది. 43వ నిమిషంలో అహ్మద్ ఇచ్చిన పాస్‌ను బర్త్‌లోమయ్ గోల్ చేయడంతో ముంబయి 2-1 ఆధిక్యంలోకి దూసుకొని వెళ్లింది. 44వ నిమిషంలో గోడార్డ్ గోల్ చేయడంతో ముంబయి ఆధిక్యం 3-1కి పెరిగింది. రెండో అర్దభాగంలో బిపిన్ సింగ్ మ్యాజిక్ చేశాడు. 47వ నిమిషంలో బర్త్‌లోమయ్ ఇచ్చిన పాస్‌ను బిపిన్ సింగ్ గోల్‌గా మలిచాడు. 86వ నిమిషంలో బిపిన్ సింగ్ మరో గోల్ చేశాడు. బిపిన్ హ్యాట్రిక్ గోల్స్‌తో ముంబయి సిటీ 6-1 తేడాతో ఒడిషా ఎఫ్‌సీపై ఘనవిజయం సాధించింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు అహ్మద్, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు బిపిన్ సింగ్‌కు లభించింది.


Next Story

Most Viewed