- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోవిడ్-19పై సైనికులు యుద్ధం చేయాలి
by Shamantha N |
<p>కరోనా మహమ్మారిపై సైన్యం కూడా యుద్ధం చేయాలని.. భద్రతా దళాల అధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. ఈ సమయంలో సైనికులు క్వారంటైన్ మౌలిక సదుపాయాలు సమకూర్చడం, అవసరమైతే ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా నివారించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన తరుణంలో ఆయన దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాపై ఆదేశాలకు మించి విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత సైన్యంపై ఉందన్నారు. దీని కోసం సైనికులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. […]</p>
X
కరోనా మహమ్మారిపై సైన్యం కూడా యుద్ధం చేయాలని.. భద్రతా దళాల అధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. ఈ సమయంలో సైనికులు క్వారంటైన్ మౌలిక సదుపాయాలు సమకూర్చడం, అవసరమైతే ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా నివారించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన తరుణంలో ఆయన దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాపై ఆదేశాలకు మించి విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత సైన్యంపై ఉందన్నారు. దీని కోసం సైనికులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని బిపిన్ రావత్ ఈ సందర్భంగా తెలిపారు.
tag: CDS, bipin rawat, comments, coronavirus, new delhi
Next Story






