చెత్తను కూడా ఆదాయ వనరుగా మార్చుతున్నాం.. హరీష్ రావు

by Shyam |

<p>దిశ, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట దిక్సూచిగా నిలిచినట్లే అభివృద్ధిలో కూడా దేశానికే సిద్దిపేట దిక్సూచి‌గా నిలవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ శంకర్ ఆకాంక్షించారు. సిద్దిపేట గ్రామీణ మండలం బుస్సాపూర్‌లో సోమవారం బయో-సీఎన్‌జీ ప్లాంట్‌ను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డా. ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలిసి మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరంతర కృషి, ఉద్యమ స్పూర్తి ఉంటేనే అభివృద్ధికి దిక్సూచిగా సిద్దిపేట నిలుస్తుందన్నారు. సిద్దిపేటలో [&hellip;]</p>

harish rao
X

దిశ, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట దిక్సూచిగా నిలిచినట్లే అభివృద్ధిలో కూడా దేశానికే సిద్దిపేట దిక్సూచి‌గా నిలవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ శంకర్ ఆకాంక్షించారు.
సిద్దిపేట గ్రామీణ మండలం బుస్సాపూర్‌లో సోమవారం బయో-సీఎన్‌జీ ప్లాంట్‌ను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డా. ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలిసి మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరంతర కృషి, ఉద్యమ స్పూర్తి ఉంటేనే అభివృద్ధికి దిక్సూచిగా సిద్దిపేట నిలుస్తుందన్నారు. సిద్దిపేటలో చెత్త కుప్పలు ఉండకూడదనే ఉద్దేశంతోనే బయో-CNG ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని హరీశ్‌ రావు అన్నారు.

చెత్తతో బాధపడుతున్న ప్రపంచం..

ప్రపంచం మొత్తం చెత్తతో బాధపడుతుందని మంత్రి తెలిపారు. ల్యాండ్ ఫిల్లింగ్‌తో భూమి, నీరు కలుషితం అవుతుందని పేర్కొన్నారు. చెత్త అనేక అనారోగ్యాలకు హేతువుగా మారుతుందన్నారు. రోజుకు సిద్దిపేట పట్టణంలో 55 వేల కిలోల చెత్త ఉత్పత్తి అవుతుందన్నారు. ప్రజా భాగస్వామ్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల కృషితో స్వచ్ఛ పట్టణంగా సిద్దిపేట రూపుదిద్దుకుందన్నారు. అభివృద్ధి అంటే.. ఆరోగ్య వాతావరణంలో జీవించే గలిగే పరిస్థితులను సృష్టించడమని స్పష్టం చేశారు. చెత్తను ఆదాయ వనరుగా మార్చుతున్నాం. బయో – CNG గ్యాస్ ను పట్టణంలో రెస్టారెంట్లకు సరఫరా చేస్తాం. మున్సిపల్ వాహనాలకు ఇంధనంగా బయో – CNG గ్యాస్ ను ఉపయోగిస్తామని మంత్రి వెల్లడించారు. పిల్లలకు ఆస్తులు, అంతస్తులు కంటే ఆరోగ్యాన్ని ఇవ్వడమే ముఖ్యం అన్నారు. సఫాయి అన్న సలాం అన్నాడు సీఎం కేసీఆర్‌. ఇప్పటి వరకు సిద్దిపేట పట్టణం 14 జాతీయ స్థాయి అవార్డులు, 4 రాష్ట్ర స్థాయి అవార్డులను దక్కించు‌కోవడంలో సఫాయిలు ముఖ్య పాత్ర వహించారన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట దిక్సూచిగా నిలిచినట్లే అభివృద్ధికి కూడా దిక్సూచిగా నిలుపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ డా. ఆండ్రూ ఫ్లెమింగ్..

తెలంగాణలోని 33 జిల్లాల్లో స్వచ్చత విషయంలో సిద్దిపేట తెలంగాణ‌కే ఆదర్శంగా నిలిచిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ డా. ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. ధృడ సంకల్పం, దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు. బయో-CNG ప్లాంట్ ద్వారా ఇండియాలోనే జీరో ల్యాండ్ ఫిల్లింగ్ పట్టణంగా సిద్దిపేట నిలుస్తుందన్నారు. వ్యర్థంను ఆదాయ వనరుగా మార్చుకోవడం గొప్ప విషయమని తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు నా అభినందనలు, శుభాకాంక్షలు అని బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ డా. ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు.

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..

మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవ‌తో దేశంలోనే బెస్ట్ మున్సిపాలిటీగా సిద్దిపేట అవతరించనుందన్నారు. హరీష్ రావు ప్రత్యేక చొరవ తోనే 100 రోజుల్లోనే బయో- CNG ప్రాజెక్ట్ పూర్తి అయిందన్నారు.

Next Story