- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిబ్రవరి 22, 23 తేదీల్లో బయో ఏషియా ఎడిషన్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి యుద్ధమే చేసిందని, ఈ క్రమంలో లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రతినిధుల ప్లాట్ ఫారంపై రావడం వల్ల సత్ఫలితాలు వస్తాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయి సమావేశాల ద్వారా ఎన్నో అవకాశాలు లభిస్తాయని, అనేక సవాళ్లకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రధానంగా లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. బయో ఏషియా 18వ ఎడిషన్ వచ్చే నెల 22, […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి యుద్ధమే చేసిందని, ఈ క్రమంలో లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రతినిధుల ప్లాట్ ఫారంపై రావడం వల్ల సత్ఫలితాలు వస్తాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయి సమావేశాల ద్వారా ఎన్నో అవకాశాలు లభిస్తాయని, అనేక సవాళ్లకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రధానంగా లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. బయో ఏషియా 18వ ఎడిషన్ వచ్చే నెల 22, 23 తేదీల్లో జరగనుంది. ఈ మేరకు వెబ్ సైట్ ను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఆవిష్కరించారు. ‘మూవ్ ద నిడిల్’ అనే థీమ్ తో బయో ఏషియా 2021 లోగోను కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ అండ్ బయో ఏషియా సీఈఓ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
Next Story






