కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి 2 ఏళ్ల సమయం : బిల్‌గేట్స్

by  |
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి 2 ఏళ్ల సమయం : బిల్‌గేట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచదేశాలను గజగజా వణికిస్తోన్న కరోనా వైరస్‌ను రూపమాపేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడమే ఏకైక పరిష్కారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే పలు యూనివర్సిటీలు, సంస్థలు వ్యాక్సిన్‌పై పరిశోధనలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాంతకంగా మారిన కరోనాపై తిరుగులేకుండా పోరాడగలిగే వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే కనీసం 9 నెలల నుంచి 2 ఏళ్ల సమయం పడుతుందని గేట్స్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కోవిడ్-19 రోగులకు అందించే చికిత్సలో శక్తివంతమైన ఔషధాలే ఉపయోగిస్తున్నారు. కాని కోవిడ్-19ను పూర్తిగా రూపుమాపి ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకొని వచ్చే సమర్థత మాత్రం వాటికి లేదని చెప్పారు. ఔషధమే లేని ఈ వ్యాధి నుంచి కాపాడాలంటే భూమిపైన ఉన్న ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేయడం తప్పనిసరని గేట్స్ స్పష్టం చేశారు. అందరికీ వ్యాక్సిన్లు అందించాలంటే వందల కోట్ల సంఖ్యలో డోసులను ఉత్పత్తి చేయాలి. ఈ ప్రక్రియ త్వరగా జరిగితేనే నష్టాన్ని తగ్గించగలమని ఆయన అన్నారు. గత నెల తొలి వారానికి వందకు పైగా వ్యాక్సిన్లు పలు దశల ట్రయల్స్ పూర్తి చేసుకున్నాయని.. వీటిలో ఒక 10 వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేయగలవనే నమ్మకం తనకు ఉందని గేట్స్ చెప్పారు. ఎంత త్వరగా వ్యాక్సిన్ తయారీకి పూనుకున్నా.. అందరికీ అందించే సరికి 3 నుంచి 4 ఏండ్ల సమయం పడుతుందని గేట్స్ చెప్పారు.

Tags : Bill Gates, Coronavirus, Covid 19, Vaccine, Development, R&D


Next Story