ఆర్టీసీ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు..

76

దిశ, అశ్వారావుపేట టౌన్ : ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో బుధవారం వెలుగుచూసింది. ఎస్సై చల్లా అరుణ కథనం ప్రకారం.. వడ్డే రంగాపురం గ్రామానికి చెందిన మడివి నారాయణ(45) అనే వ్యక్తి వినాయకపురం గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతుం డగా ఆసుపాక గ్రామం మూలమలుపు వద్ద భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది.

దీంతో బైకుతో పాటు వాహనదారుడు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..