ఆ కూరగాయ ధర కిలో లక్ష రూపాయలు.. పండిస్తున్నదెవరో తెలుసా?

328

దిశ, వెబ్ డెస్క్: భారత దేశం అంటే వ్యవసాయానికి పెట్టింది పేరు. ఎన్ని కష్టాలు పడైనా సరే భూమిని సాగు చేయడానికే రైతులు మొగ్గు చూపుతారు. ఇక అందులోను సాంప్రదాయమైన పంటలను మాత్రమే పండిస్తారు. వాటికి ధరలు రాక , అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక ఇవి కాకుండా కొత్త సాగుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కానీ బీహార్ కి చెందిన ఒక రైతు విన్నూతంగా ఆలోచించాడు. ఎప్పుడూ వేసే పంటలతో విసిగి వేసారి పోయిన ఆ రైతు ఒక అరుదైన పంటను సాగు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆ పంట అతనికి లక్షలు తీసుకొచ్చి పెడుతుంది. ఇంతకీ ఆ పంట ఏంటి? ఆ రైతు ఎవరు? అనేది తెలుసుకుందాం.

బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా కరమ్‌దిహ్ గ్రామానికి చెందిన అమ్రేష్ సింగ్ తన చిన్నతనం నుండి తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఎప్పుడూ తన తండ్రి కి అధిక దిగుబడి వచ్చిన పాపాన పోలేదు. పురుగుల మందులు, విత్తనాలు కొనడానికే సరిపోయేది. ఇక ఈ మూస పద్దతి ఆమ్రేష్ కి నచ్చలేదు. ఏదైనా కొత్త పంటను సాగు చేయాలనీ అనుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయల్లో ఒకటైన ‘హాప్ షూట్స్’ అనే పంటను పండిస్తున్నాడు. దీని ధర వంకాయలు. టమాటాలులా పదుల్లో , వందల్లో ఉండదు.. ఒక కేజీ ‘హాప్ షూట్స్’ రూ.85,000 ఉంటుంది. ఇంకా డిమాండ్ ఎక్కువగా ఉంటే లక్ష కూడా పలకొచ్చు.

ఏంటి.. ఒక కేజీ లక్ష రూపాయలా అని నోరెళ్లబెట్టకండి. ఈ కూరగాయలను తింటే అంతే బలం వస్తుంది. ఏంటి ఈ కూరగాయల ప్రత్యేకత అంటే వీటిని తినడం వలన టీబీ తగ్గించవచ్చు, ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను, లుకేమియాను తగ్గించవచ్చని అధ్యనాలలో తేలింది. ఇకపోతే వీటి యొక్క పూలను ‘హాప్ క్రాన్స్’ అంటారు. వీటిని బీర్ తయారీలో వాడుతారు.

 

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..