- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bigg Boss 9: బిగ్ బాస్-9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవే.. లిస్ట్‌లో అలేఖ్య చిట్టి పికిల్ రమ్యతో పాటుగా ఉన్నది ఎవరంటే?
తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 9’.. సక్సెస్ ఫుల్‌గా రెండో వారం పూర్తి చేసుకోబోతున్నది.

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 9’.. సక్సెస్ ఫుల్‌గా రెండో వారం పూర్తి చేసుకోబోతున్నది. మొదటి వారం ఎమోషన్స్, కుకింగ్స్, ఫైటింగ్‌తో సాగి ఫైనల్‌గా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేల్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇక ఈ వారం కూడా ఇప్పటికే ఓటింగ్ పూర్తి కాగా.. నిన్నటి ఎపిసోడ్‌లో కామనర్స్‌పై అలాగే సెలబ్రిటీ అయిన రీతూ చౌదరిపై హోస్ట్ నాగార్జున్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యి.. బిగ్ బాస్-9 టీఆర్పీ మరింత పెంచేశాడు. ఇక వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ఈ సారి నామినేషన్లలో భరణి, ఫ్లోరా సైనీ, హరీష్, మనీష్, ప్రియ, పవన్, సుమన్ శెట్టి ఇలా ఏడుగురు ఉండగా.. వీరిలో డేంజర్ జోన్‌లో హరీష్, ప్రియ, మనీష్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నుంచి మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్-9 సీజన్‌కు సంబంధించి వైల్డ్ కాల్డ్ ఎంట్రీపై అప్డేట్ వచ్చింది. సోషల్ మీడియా రివ్యూవర్ ఆదిరెడ్డి అనాలసిస్ ప్రకారం.. బిగ్ బాస్ 9లో హౌప్ లోకి ఎంట్రీ ఇచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరో చూద్దాం. 1. సుహాసిని, 2. కావ్య (చిన్ని సీరియల్ ఫేమ్), 3. రమ్య (అలేఖ్య చిట్టి పికిల్స్), 4. శివకుమార్ (సీరియల్ నటుడు), 5. సంజయ్ తుమ్మా (ఫేమస్ చెఫ్), 6. అంకిత (హీరోయిన్)తో పాటుగా దివ్వెల మాధురి పేరు కూడా చెప్పడం విశేషం. మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపాడు. అయితే.. ఇప్పటికే బిగ్ బాస్ ఎంట్రీపై స్పందించిన దివ్వెల మాధురి.. తన భర్త రాజాను వదిలి ఉండలేను అందుకే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిన వదులుకున్నా అని స్పష్టం చేసింది. మరి ఈ లిస్ట్‌లో ఫైనల్‌గా వెళ్లేది అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో తెలియనుంది.






