టిక్కెట్‌ టూ ఫినాలే రేసులో నిలిచింది ఆ ఇద్దరే..! బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనలిస్ట్ ఎవరంటే..?

by sudharani |   ( Updated:2023-12-13 16:02:35.0  )
టిక్కెట్‌ టూ ఫినాలే రేసులో నిలిచింది ఆ ఇద్దరే..! బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనలిస్ట్ ఎవరంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్ 7- ఇంకా మూడు వారాల మాత్రమే మిగిలి ఉంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ జరగ్గా.. ప్రస్తుతం హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా.. పల్లవి ప్రశాంత్, శివాజీ, గౌతమ్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, అర్జున్, శోభా శెట్టి నామినేషన్‌లో ఉన్నారు. ఇక ఈ సీజన్‌లో టికెట్ టూ ఫినాలే రేస్ స్టార్ట్ అయింది. అయితే.. ప్రతి సీజన్‌లో ఉండే ‘టికెట్ టూ ఫినాలే’ పేరును మార్చి ‘ఫినాలే అస్త్ర’ అని పెట్టారు. ఈ ఫినాలే అస్త్రాని గెలుచుకునేందుకు హౌస్ మేట్స్‌కు ఓ ఛాలెంజ్ విసిరాడు బిగ్ బాస్.

ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ ఓ రౌంట్ సర్కిల్‌పై ఉన్న బండపై నిలబడి ఉండాలి. ఆ సర్కిల్‌ మధ్యలో ఉన్న ఓ రాడ్ తిరుగుతూ ఉంటుంది. అది వాళ్ల దగ్గరకు వచ్చినప్పుడు ఆ రాడ్ తగలకుండా, కంటెస్టెంట్స్ గెంతుతూ ఉండాలి. అయితే.. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరు చివరి వరకు ఉంటారో వాళ్లే ‘ఫినాలకే అస్త్ర’ ను గెలుచుకుంటారు. ఇక గేమ్ స్టార్ట్ కాగానే.. ముందుగా ప్రశాంత్ పడిపోయాడు. తర్వాత శోభాశెట్టి.. ఇలా వరుసగా శివాజీ, యావర్, అమర్, గౌతమ్ పడిపోయారు. ఇక ఫైనల్‌గా అర్జున్, ప్రియాంక ఈ రేసులో నిలబడ్డారు. అయితే వాళ్లిద్దరిలో ‘ఫినాలే అస్త్ర’ గెలిచింది ఎవరు అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Advertisement

Next Story