- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bigg Boss-9: హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు గెస్టులు.. యుద్ధభూమిలో పర్యటన చేసిన సెలబ్రిటీలు ఎవరంటే?
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్‌బాస్ సీజన్-9 కు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి.

దిశ, సినిమా: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్‌బాస్ సీజన్-9 కు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఈ సారి రణరంగమే అని నాగార్జున ముందే అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే. అన్నట్లుగా ఈ సారి షోలో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. 9 మంది సెలబ్రిటీలు.. 6 మంది సామాన్యులు వెళ్లారు. అగ్ని పరీక్ష పేరుతో కామనర్స్‌కు చుక్కలు చూపించిన బిగ్‌బాస్.. హౌస్‌లోకి వెళ్లాక సెలబ్రిటీలకు షాకిచ్చారు. అన్ని సదుపాయాలు సామాన్యులకు కల్పిస్తూ.. సెలబ్రిటీలను కష్టపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, బిగ్‌బాస్ హౌస్‌లోకి ఓ ముగ్గురు సెలబ్రిటీలు హాజరయ్యారు. గత సీజన్లులో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న సీరియల్ నటి ప్రియాంక జైన్, అమర్ దీప్, విష్ణు ప్రియ వెళ్లారు. హౌస్ టూర్ చేసిన వీరు.. ఇంట్లో రచ్చ రచ్చ చేశారు. అలాగే పలు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఇక ఇందులో సామాన్యులే తోపులు అన్నట్లుగా మాట్లాడారు.అలాగే ఓ హింట్ కూడా ఇచ్చారు. ప్రారంభం మూడు వారాలపాటు బాగానే ఉన్నప్పటికీ తర్వాత మారుతుందని మనకు తెలుసుగా అని అన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ వీడియోకు యుద్ధభూమిలో విష్ణు ప్రియ, ప్రియాంక, అమర్ దీప్ పర్యటన చేశారని క్యాప్షన్ ఇచ్చారు.






