ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లేందుకు నామినేట్ అయింది వీళ్లే..?

by sudharani |
ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లేందుకు నామినేట్ అయింది వీళ్లే..?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్.. ప్రేక్షకుల అంచనాలను మించి ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే.. బిగ్ బాస్ వీక్ మొత్తం ఒక ఎత్తు అయితే.. నామినేషన్స్ మాత్రం ఓ ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియలో ప్రేక్షకుడికి కావాల్సినంత కిక్ దొరుకుతుంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో నామినేషన్‌లో ఉన్నది వీళ్లే అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం.. నామినేషన్స్‌లో ఒక్కొక్కరి పర్ఫామెన్స్ మాములుగా లేదు. ఇక గత శనివారం శివాజీ తన పవర్ ఆస్త్ర కోల్పోవడంతో నామినేషన్‌లో చాలా మంది ఆయన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం పవర్ అస్త్ర గెలుచుకుని సందీప్, శోభ శెట్టి, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ నుంచి తప్పించుకోగా.. మిగిలిన ఏడుగురు ఈ నామినేషన్స్‌లో ఉన్నట్లు టాక్. ఈ క్రమంలోనే టేస్టీ తేజ డైరెక్ట్ నామినేట్ కావడంతో.. తేజ, అమర్ దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శివాజీ, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ నామినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ బట్టి, వచ్చిన ఓట్లు బట్టి ఈ వారం ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాల్సి ఉంది.

Next Story

Most Viewed