- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Bigg Boss 7 Telugu: వాళ్ళ ముందు ఏడవలేకపోతున్నా చాలా ఇబ్బందిగా ఉందంటూ .. కన్నీరు పెట్టుకున్న శివాజీ?
దిశ,వెబ్ డెస్క్: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు చేరుకుంది. కెప్టెన్సీ కోసం జరుగుతున్న టాస్క్ లో ఇంటి సభ్యులు రెండు టీమ్ లుగా విడిపోయి పోటీ పడుతున్నారు. హౌస్ మేట్స్ ఒక పక్క స్కిట్ చేస్తూనే మధ్య మధ్యలో వచ్చే టాస్కుల్లో పాల్గొన్నారు. అలా బిగ్ బాస్ ఆసక్తికర టాస్కులు ఇచ్చి ఆటను మరింత రసవత్తరంగా మార్చేసారు. ఆ చివరి టాస్క్ ఏంటంటే, ఈ వారానికి కెప్టెన్సి పోటీదారులుగా నిలిచి బృందంలోని సభ్యులు మిగిలిన వారిలో ఒకరిని అనర్హుడిగా ప్రకటించి అతని ఫోటోకు గొలుసు కట్టి స్విమ్మింగ్ పూల్ లో పడేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
నేడు విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో శివాజీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి, 'శివాజీ ఎలా ఉన్నారు?' అని ప్రశ్నించగా.." చాలా ఇబ్బందిగా బిగ్ బాస్ .. ఎవరు లేకపోతే నాలో నేను ఏడుస్తున్న. ఎవరైనా ఉంటే నవ్వుతా ఏడుస్తున్నా లోపల.. వాళ్ళ అందరి ముందు ఏడవలేకపోతున్నా.. లోపల చాలా బరువుగా ఉంది" అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఎక్కడా బాధ పడుతున్నాను అంటే.. ఇందాక నువ్వు ఆడలేదు అని ఇన్ డైరెక్టుగా అనేసరికి బాధగా అనిపించింది బిగ్ బాస్ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రోమోలో చూపించిన దాని ప్రకారం శివాజీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ అతన్ని ఇంటికి పంపించేస్తారా? లేక ట్రీట్మెంట్ కోసం బయటికి తీసుకొస్తారా? అనేది చూడాలి.