- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమర్‌ని ఎదవని చేసిన ప్రియాంక.. గొర్రె, మేక ఒకటే అంటూ..
బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ వారం ‘ఫినాలే అస్త్ర’ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. మొదటి నుంచి ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ టాస్క్‌లో.. నేడు నాలుగో టాస్క్ ‘ఎత్తర జెండా’. ఈ టాస్క్‌లో ఎవరి బోట్స్ వాళ్లకు ఇచ్చి అందులో ఇసుక నింపాల్సి ఉంటుంది. ఇందులో ప్రశాంత్ గెలిచినట్లు తెలుస్తోంది. ఇక ఐదో టాస్క్ ‘గెస్ చేయి గురూ’. ఈ టాస్క్ ఎంతో ఫన్నీగా సాగింది. కొన్ని సౌండ్స్ వస్తాయి. అవి ఏ జంతువు అనేది కనిపెట్టాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మేక అరుపు వినిపించగా.. దాన్ని అమర్ గొర్రె అంటాడు. అంతే కాకుండా నువ్వు రాసింది తప్పు అని చెప్పిన హౌస్ మేట్స్‌తో గొర్రె, మేక రెండూ ఒకటే అంటూ చాలా అమాయకంగా వాదనకు దిగుతాడు.
ఇక ఫైనల్‌గా స్కోర్ బోర్డ్‌లో లీస్ట్‌లో ఉన్న ప్రియాంకని గేమ్ ఛేంజర్‌ని చేశాడు బిగ్ బాస్. ‘ఫినాలే అస్త్ర’ రేస్ నుంచి ప్రియాంకను తప్పిస్తూ.. నీ దగ్గర ఉన్న 250 పాయింట్లలో సగం మీకు ఇష్టమైన వాళ్లకు ఇవ్వొచ్చని చెప్తాడు బిగ్ బాస్. దీంతో ప్రియాంక క్షణం కూడా ఆలోచించుకోకుండా వెంటనే గౌతమ్‌కు ఇస్తా అని చెప్తుంది. ఇక బాగా హర్ట్ అయిన అమర్.. ‘నాకు ఇవ్వాలని అనిపించలేదా. ఇక్కడ ప్రతీది ముఖ్యమే కదా.. చివరకు నన్ను ఎదవని చేశావ్’ అని ప్రియాంకతో అనుకుంటా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.






