బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-07 15:49:50  IST  )

బుల్లితెర అభిమానులు, తెలుగు రాష్ట్రాల యువతీ, యువకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది.

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర అభిమానులు, తెలుగు రాష్ట్రాల యువతీ, యువకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ - 9(Bigg Boss-9) ప్రారంభం అయింది. ఒక్కో కంటెస్టెంట్‌ను తనదైన శైలిలో హోస్ట్ అక్కినేని నాగార్జున పరిచయం చేస్తున్నారు. ఇప్పటివరకు నటి తనూజ, ఫ్లోరా షైనీ, కల్యాణ్‌ పడాల, ఇమ్మాన్యుయేల్‌, శ్రష్టి వర్మ, హరిత హరీశ్‌, భరణి, రీతూ చౌదరి, రామ్‌ రాథోడ్‌ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్‌తో బుజ్జిగాడు సినిమాలో నటించిన నటి సంజన(Sanjjana) వెళ్లారు. ‘బుజ్జిగాడు’ సహా పలు తెలుగు చిత్రాల్లో ఆమె నటించారు. ఇదిలా ఉంటే.. మళ్లీ నాగార్జునే హోస్ట్‌గా కొనసాగుతున్నారని ప్రోమో ద్వారా క్లారిటీ వచ్చింది.

Next Story