పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వేధింపులు.. అమర్ దీప్ తల్లి ఎమోషనల్ కామెంట్స్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2023-10-17 07:22:53  IST  )

తెలుగు రియీలిటీ బిగ్‌బాస్ షో స్టార్ట్ అయి ఆరు వారాలు పూర్తి చేసుకుంది.

పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వేధింపులు.. అమర్ దీప్ తల్లి ఎమోషనల్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియీలిటీ బిగ్‌బాస్ షో స్టార్ట్ అయి ఆరు వారాలు పూర్తి చేసుకుంది. కాగా ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ గొడవలను తీసుకొని బయట ఉన్న కొందరు అభిమానులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. అమర్ దీప్ కుటుంబాన్ని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వేధింపులకు గురి చేస్తున్నారు.

తాజాగా, దీనిపై అమర్ దీప్ తల్లి స్పందించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెబుతూ.. కొందరు అమర్ దీప్ కుటుంబంలోని ఆడవారి పై అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారంటూ అమర్ దీప్ తల్లి బాధ పడ్డారు. అలాగే అతనికి ఓటు వేసి గెలిపించుకోండి కానీ ఆడవారిపై అసభ్యకరమైన కామెంట్స్ చేయడమేంటని ఆమె ఫైర్ అయింది. అలాగే ఈ విషయం గురించి నాగార్జున గారికి కూడా చెప్తానని తెలియజేసింది.

Next Story