బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. శివాజీ కూడా ఎలిమినేట్?

by Hamsa |   ( Updated:2023-10-01 08:06:06.0  )
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. శివాజీ కూడా ఎలిమినేట్?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ విజయవంతంగా కొనసాగుతుంది. ఇటీవల ఏడవ సీజన్ స్టార్ట్ అయి నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. అయితే నిన్న వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్ శివాజీకి షాక్ ఇచ్చాడు. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా యాక్టివిటీ ఏరియాలోకి పిలిచి సందీప్, శివాజి, శోభా శెట్టిలలో అనర్హత కలిగిన హౌస్‌మేట్ ఎవరో చెప్పాలని అడిగాడు. ఇందులో సందీప్‌కు 3 ఓట్లు, శివాజికి మూడు ఓట్లు వచ్చి టై అయింది.

దీంతో వీళ్ళిద్దరిలో పవర్ అస్త్రాన్ని ఉంచుకోవడానికి అనర్హులు ఎవరో చెప్పాలని మరోసారి ఓటింగ్ పెట్టారు నాగార్జున. ఈ ఓటింగ్‌లో మాత్రం సందీప్ మాస్టర్‌కు మూడు ఓట్లే వచ్చాయి. కానీ, శివాజీ అనర్హుడు అని ఏకంగా 9 మంది చేతులు లేపారు. దీంతో హోస్ట్ నాగార్జున అతడిని హౌస్‌మేట్‌గా ఉండడానికి అనర్హుడు అని ప్రకటించాడు. అంతేకాదు, గతంలో గెలుచుకున్న శివాజీ పవర్ అస్త్రాన్ని తెప్పించి పగలగొట్టించాడు. దీంతో ఇకపై శివాజీకి ఎలాంటి సౌకర్యాలు కూడా లభించవని చెప్పాడు. కన్ఫార్మ్ హౌస్‌మేట్‌గా ఎలిమినేట్ అయ్యావు. సాధారణ హౌస్‌మెట్‌ అయిపోయావు కాబట్టి వీఐపీ రూమ్‌ను కూడా ఖాలీ చేయమని నాగార్జున చెప్తాడు. శివాజీ పవర్ అస్త్ర విషయంలో నాగార్జున ఇచ్చిన ట్విస్ట్‌కి హౌస్‌మెట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.ఇక ఈరోజు రతిక, ఎలిమినేట్ అవనుందని పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరీ ఈ రోజు (ఆదివారం) ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఎలాంటి ట్విస్టులు ఇస్తాడో.

Advertisement

Next Story