- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIGG BOSS 9: అతడి కళ్లలోకి కళ్లు పెట్టిన రీతూ..హౌస్‌లో లవ్ ట్రాక్ షురూ!
మొదటి రోజు షోలో బిగ్ బాస్ రీతూ చౌదరి (REETHU CHOWDARY)కి, పవన్ కల్యాణ్ పడాల (PAWAN KALYAN PADALA) ఇద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు రొమాంటిక్‌గా చూసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 9 (BIGG BOSS SEASON 9) షురూ అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ అంటేనే గొడవలు, లవ్ ట్రాక్‌లు. ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిగా చూసేది కూడా అవే. యూత్ షో చూడాలంటే లవ్ ట్రాక్స్ అయితే పక్కాగా ఉండాల్సిందే. అలా ఉంటేనే బిగ్ బాస్ మసాలా జోడించి ప్రేక్షలకు కావాల్సిన స్టఫ్ వడ్డిస్తాడు. అయితే ఈ సీజన్‌లో కూడా ఓ లవ్ ట్రాక్ షురూ కాబోతుంది అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మొదటి రోజు షోలో బిగ్ బాస్ రీతూ చౌదరి (REETHU CHOWDARY)కి, పవన్ కల్యాణ్ పడాల (PAWAN KALYAN PADALA) ఇద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు రొమాంటిక్‌గా చూసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఐ బ్లింక్ ఛాలెంజ్‌లో భాగంగా ఇలా ఇద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే వీడియో వైరల్ అవ్వడంతో ఇద్దరి మధ్యలో లవ్ ట్రాక్ షురూ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇద్దరి జోడీ కూడా కుదిరిందని అంటున్నారు. ఇదిలా ఉంటే రీతూ చౌదరి టీవీ షోల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రీతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తరవాత ఫోటో షూట్స్ తో పాటూ అనేక టీవీ షోల్లో కనిపించి మెప్పించింది. ఇక పవన్ పడాల ఆర్మీ మ్యాన్‌గా కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అగ్నిపరీక్ష దాటుకుని ఇంట్లోకి వచ్చాడు. మరి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నిజంగా మొదలైతే ఎలా ఉంటుందో చూడాలి.
Read Also..






