Bigg Boss 7 Telugu: ఉల్టా పుల్టా అంటే ఇదేనా.. లీకైన టాప్ 5 అగ్రిమెంట్.. ముందే అంతా ఫిక్స్?

by Disha Web Desk 10 |
Bigg Boss 7 Telugu: ఉల్టా పుల్టా అంటే ఇదేనా.. లీకైన టాప్ 5 అగ్రిమెంట్.. ముందే అంతా ఫిక్స్?
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నట్లు కొనసాగుతుంది. ఈ సీజన్ ఎవరు ఊహించలేని విధంగా ట్విస్టులు ప్లాన్ చేసారు బిగ్ బాస్. తాజాగా బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ లో టాప్ 5 అగ్రిమెంట్ గురించి ఇంటి సభ్యులు తేజా, అమర్ దీప్ ఇన్ డైరెక్టుగా మాట్లాడుకున్నారు. ‘‘ఈ వీక్ సేవ్ అయితే గట్టిగా ఆడతాను.. లాస్ట్ వీక్ రెడ్ ఇచ్చారు.. ఈవారం ఏమిస్తారో అని అమర్, తేజాతో అన్నాడు. అప్పుడు తేజా అవన్నీ పక్కనపెట్టు కానీ.. ‘నీకు టాప్ 5 అగ్రిమెంట్ ఉందంట కదా.. నిజమేనా?’ అర్ధం కాకుండా సైగ చేస్తూ అడిగాడు టేస్టీ తేజా. అది టాప్ 5 అన్నాడో.. లేదంటే.. ఐదు వారాల అగ్రిమెంట్ అన్నాడో క్లారిటీగా చూపించలేదు కానీ.. కానీ ఐదు అనేది మాత్రం స్పష్ఠంగా కనిపించింది లైవ్ ఎపిసోడ్‌లో. టేస్టీ తేజా ఈ మ్యాటర్ లీక్ చేయడంతో.. అమర్ కెమెరాల వైపు చూస్తూ ఏదో చెప్పాడు. అయితే దాన్ని లైవ్ ఎపిసోడ్‌ నుంచి సడెన్‌గా కట్ చేసేశారు.

అయినా అమర్ దీప్‌కి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. కానీ తను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నేను ఈ వారం ఉంటానా ? ఉండనా అని అంటున్నాడు. ఇలా ఎందుకు అంటున్నాడో అర్ధం కాలేదు? నిజంగానే అతనికి టాప్ 5 కంటెస్టెంట్‌గా అగ్రిమెంట్ ఉందా? ముందే మొత్తం ఫిక్స్ చేసుకొని ఇంట్లోకి వెళ్లాడా? కావాలనే డైవర్ట్ చేయడానికి ఇలా అంటున్నాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Read More: Bigg Boss 7 Telugu: ఆ ఒక్క తప్పు వల్లే దామినిని బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారా?



Next Story

Most Viewed