Bigg Boss-7: శివాజీ-యావర్ మధ్య గొడవ.. వాడు దానికి ఫేవర్ చేయాలని చూస్తున్నాడురా.. నోరు జారిన అమర్

by sudharani |   ( Updated:2023-10-06 09:09:21.0  )
Bigg Boss-7: శివాజీ-యావర్ మధ్య గొడవ.. వాడు దానికి ఫేవర్ చేయాలని చూస్తున్నాడురా.. నోరు జారిన అమర్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7.. నాలుగు వారాలు సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుని ప్రస్తుతం ఐదో వారంలో అడుగు పెట్టింది. ఈ వారం నామినేషన్‌లో టేస్టీ తేజా, శుభశ్రీ, ప్రియాంక, అమర్ దీప్, యావర్, గౌతమ్ కృష్ణ, శివాజీ ఉన్నారు. ఇక నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత పవర్ అస్త్ర టాస్క్ ప్రారంభమైంది. హౌస్ మేట్స్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. నిన్నటి కెప్టెన్సీ టాస్క్‌లో సంచాలకులుగా యావర్, శోభా శెట్టిలను నియమించాడు బిగ్ బాస్. అంతే కాకుండా టాస్క్ ఆడుతూనే సంచాలక్‌గా ఉండాలని వారికి ఆదేశించడంతో.. యావర్ తడబడ్డాడు. అసలు టాస్క్‌లో ఎవరికి న్యాయం చేయాలి, ఎవరు ఏం ఆడారో తెలియని అయోమయంలో మూడు, నాలుగు సార్లు తీసుకున్న నిర్ణయాన్ని మార్చాడు. దీంతో హౌస్‌లో గందరగోళం నెలకొంది.

ప్రియాంక, శోభా శెట్టి- అమర్ దీప్, సందీప్- శివాజీ, ప్రశాంత్- యావర్, తేజ- శుభశ్రీ, గౌతమ్ ఇలా ఐదు జంటలుగా విడిపోయి కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడ్డారు. అయితే.. ఇందులో అందరి కంటే ముందు ఈ టాస్క్‌లో గెలుపొంది పల్లవి ప్రశాంత్, శివాజీ గంట మోగిస్తారు. తర్వాత అమర్, సందీప్ టాస్క్ కంప్లీట్ చేయకుండానే గంట మోగించి.. టాస్క్ పూర్తయిన తర్వాత గంట మోగించమన్నారు కానీ ముందు మోగించకూడదు అని బిగ్ బాస్ చెప్పలేదు కదా అంటూ వంకర సమాధానం చెప్తాడు. ఇలా టాస్క్‌లు పూర్తయిన తర్వాత ఎవరు సరిగ్గా ఆడకపోవడంతో విజేతలను నిర్ణయించడంలో యావర్, శోభాశెట్టిలకు పెద్ద టాస్క్ అయింది.

మొదటి శివాజీ, ప్రశాంత్‌లకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చి.. సెకండ్ ప్లేస్ అమర్, సందీప్‌లకు ఇస్తాడు. ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని సుబ్బు, గౌతమ్‌లకు మొదటి ప్లేస్ ఇస్తాడు. దీంతో హౌస్‌లో రచ్చ మొదలవుతోంది. ఈ నిర్ణయంతో ఎంతో స్నేహంగా ఉండే శివాజీ, యావర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. అంతే కాదు హౌస్‌లో ఉన్న ప్రతీ ఒక్కరు కూడా యావర్‌ను తిట్టి పోశారు. ఇక అమర్ దీప్ అయితే.. ‘‘ఆ యావర్ గాడు.. దానికి (సుబ్బు) ఫేవర్ చేయాలని మొత్తం గేమ్ మార్చేశాడు.. ఇదిరా ఫేవరిజయ్ అంటే’’ అంటూ నోరు జారాడు. ఇక్కడ వరకు ఈ రోజు ప్రోమో ముగుస్తోంది. ఇక నెక్ట్స్ ఏమౌతుంది అనేది ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Advertisement

Next Story