బిగ్‌బాస్-9: ఆ ఇద్దరి వల్లే గేమ్ గెలవాలనుకుంటుందంటూ అంతా ఆమెను టార్గెట్.. ఈ వారం ఎలిమినేట్ కానుందా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:37:10  IST  )

బిగ్‌బాస్-9(Bigg Boss-9) షోలో వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ సంచలనం సృష్టిస్తున్నారు.

బిగ్‌బాస్-9: ఆ ఇద్దరి వల్లే గేమ్ గెలవాలనుకుంటుందంటూ అంతా ఆమెను టార్గెట్.. ఈ వారం ఎలిమినేట్ కానుందా?
X

దిశ, సినిమా: బిగ్‌బాస్-9(Bigg Boss-9) షోలో వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ సంచలనం సృష్టిస్తున్నారు. వారంతా సీరియల్ నటి తనూజ(Tanuja)ను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల రమ్య మోక్ష ఆమెపై ఘోరమైన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తనూజపై వైల్డ్ ద్వారా వచ్చిన అయేషా కూడా ఆమెనే టార్గెట్ చేయడం గమనార్హం. మాధురి, అయేషా(Ayesha), రమ్య హౌస్‌లో దుమ్మురేపుతున్నారు. వీరి గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఈక్రమంలో.. అయేషా నామినేషన్స్‌లో తన ప్రతాపం చూపించింది. నీ వల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతోంది. నీకున్న బాండింగ్స్ వల్ల ఫేవరిజం జరుగుతుందని రెచ్చిపోయింది. నీ వల్ల భరణి గారి గేమ్ దెబ్బతింటోంది.

స్టార్ మాలో సీరియల్స్ బాగానే నడుస్తున్నాయి. అది ఇక్కడ అక్కర్లేదు.. నువ్వు నటించకు అని ఫైర్ అయింది. అలాగే బాయ్ ఫ్రెండో, నాన్నో ఉంటే ఫైనల్ వరకు వచ్చేస్తాం అన్నట్లుగా ఉంది నీ ప్రవర్తన అనేసింది. దీంతో తనూజ నువ్వు కూడా ఇంతకుముందు సపోర్ట్ అడిగావు కదా మరి అని తనూజ కూడా రెచ్చిపోయింది. ఇక ఆ తర్వాత కెప్టెన్ కళ్యాణ్‌కు అవకాశం రాగా.. డైరెక్ట్‌గా రామ్ రాధోడ్‌ను నామినేట్ చేశాడు. ఇక ఈ వారంలో దివ్య, సుమన్ శెట్టి, తనూజ, భరణి, రాము, డిమాన్ పవన్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఇదంతా అయిపోయాక ఇమాన్యుయేల్ అయేషాతో సూపర్‌గా చెప్పావ్ అని అంటాడు. ఇదంతా చూస్తుంటే.. ఈ వారం తనూజ ఎలిమినేట్ అయి బయటకు పోయేలా కనిపిస్తోంది.

Next Story