బిగ్ బాస్ షోలో ఆదివారం నాగార్జున వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా?

by Anjali |   ( Updated:2023-10-09 08:17:07.0  )
బిగ్ బాస్ షోలో ఆదివారం నాగార్జున వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: తాజాగా మొదలైన ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 ఇప్పుడు ఆసక్తిగా మారింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఐదుగురిని ఇంట్లోకి పంపించిన బిగ్ బాస్ 2.0 అంటూ కొత్త ఆట మొదలెట్టారు. ఇక ఎవరూ ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ చేసి శుభ శ్రీని ఇంటికి పంపించగా ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ గౌతమ్‍ను సీక్రెట్ రూమ్‍లోకి పంపించారు నాగార్జున. ఇక ఇప్పుడు అసలు ఆట మొదలుకానుంది. ఇదిలావుంటే యాంకరింగ్ యంగ్‌లుక్స్‌తో స్టైలిష్‌గా తన సత్తా చాటుతున్నాడు నాగార్జున. ముఖ్యంగా వీకెండ్‌ ఎపిసోడ్స్‌లో నాగార్జున తన కాస్ట్యూమ్స్‌‌తో భాగా అట్రాక్ట్ చేస్తుంటాడు. అయితే ఈ మధ్య కాలంలో హీరోల డ్రెస్సింగ్ మీద నెటిజన్లకు ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. వారు ఎలాంటి బట్టలు ధరించిన వెతికి మరి రెట్లు కనిపెడుతున్నారు. అలాగే ఇప్పుడు కింగ్ నాగార్జున షర్ట్ ఖరీదు కూడా కనిపెట్టగా ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున ధరించిన షర్ట్‌ ఖరీదు అక్షరాల రెండు లక్షలు అని తెలుస్తోంది. ఇక దీనిపై సోషల్ మీడియాలో మిమ్స్ చేస్తున్నారు.


Advertisement

Next Story