బిగ్ బాస్ 9 షురూ..ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సీరియల్ బ్యూటీ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-07 14:30:10  IST  )

బిగ్ బాస్ సీజ‌న్ 9 ఈరోజు గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. గత సీజన్లకు చాలా భిన్నంగా ఈ సీజన్‌ను ప్లాన్ చేశారు. రెండు హౌస్‌లలో ఈ సారి కంటెస్టెంట్స్ ఉంటారు.

బిగ్ బాస్ 9 షురూ..ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సీరియల్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజ‌న్ 9 ఈరోజు గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. గత సీజన్లకు చాలా భిన్నంగా ఈ సీజన్‌ను ప్లాన్ చేశారు. రెండు హౌస్‌లలో ఈ సారి కంటెస్టెంట్స్ ఉంటారు. అంతే కాకుండా ఒక హౌస్ కంటెస్టెంట్స్ ఎంపిక కోసం అగ్నిపరీక్ష నిర్వహించారు. కామన్ పీపుల్‌కు దీని ద్వారా అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్‌‌ను జడ్జిలుగా నియమించి అగ్ని పరీక్షకు ఆడిషన్స్ నిర్వహించారు.



13 మంది టాప్ కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయగా వారిలో నుండి ఐదుగురు నేరుగా హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ మొదలవ్వగా మొదటి కంటెస్టెంట్‌గా సెలబ్రెటీని పంపించారు. సీరియల్ బ్యూటీ తనుజ హౌస్ లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. వస్తూనే గేమ్ ఛేంజర్ సినిమాలోని జరగండి జరగండి అనే పాటకు స్టెప్పులు వేస్తూ తనుజ ఆకట్టుకుంది. అంతే కాకుండా రెండో కంటెస్టెంట్ గా ఫ్లోరా సాయిని ఎంట్రీ ఇచ్చింది.

Next Story