- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIGG BOSS 9: తొలిరోజే రూల్స్ బ్రేక్.. పారిపోయేలా పనిష్మెంట్ ఇచ్చిన బిగ్ బాస్
తొలిరోజే గార్డెన్ ఏరియాలో ఉండాల్సిన సెలబ్రెటీలు హౌస్‌లోకి రావడంపై బిగ్ బాస్ ఫైర్ అయ్యారు. కంటెస్టెంట్లు అంతా ఇంటి రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అంటూ ఫుడ్ మొత్తం కట్ చేస్తున్నానని ప్రకటించారు. ఈ క్రమంలో తనను తినొద్దు అంటే తినను కానీ నోటి కాడ ముద్దను లాక్కోను అంటూ మాస్క్ మ్యాన్ హరీష్( harish) తన అభిప్రాయం చెప్పాడు. దీంతో అంతా కలిసి మీరు గార్డెన్ ఏరియాకు వెళ్లి ఫుడ్ తినొచ్చు అంటూ సెలబ్రెటీలకు చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్-9 (Biggboss season 9) ఆదివారం మొదలైన సంగతి తెలిసిందే. కాగా నేడు రెండు ప్రోమోలు (biggboss promo) విడుదలవ్వగా తొలిరోజే హౌస్‌లో హీట్ పెరిగిపోయింది. ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. వారిలో ఆరుగురు కామనర్స్ ఉండగా 9 మంది సెలబ్రెటీలు ఉన్నారు. అగ్నిపరీక్ష పాస్ అయ్యి రావడంతో బిగ్ బాస్ కామనర్లను ఓనర్లుగా, సెలబ్రెటీలను అద్దెకొచ్చినవారిలా విడదీసి ఓనర్లకు బిగ్ బాస్ హౌస్ కేటాయించారు. ఇక సెలబ్రెటీలకు మాత్రం గార్డెన్ ఏరియాలోనే ఉండాలని ఆదేశించారు. అయితే తొలిరోజే గార్డెన్ ఏరియాలో ఉండాల్సిన సెలబ్రెటీలు హౌస్‌లోకి రావడంపై బిగ్ బాస్ ఫైర్ అయ్యారు.
కంటెస్టెంట్లు అంతా ఇంటి రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అంటూ ఫుడ్ మొత్తం కట్ చేస్తున్నానని ప్రకటించారు. ఈ క్రమంలో తనను తినొద్దు అంటే తినను కానీ నోటి కాడ ముద్దను లాక్కోను అంటూ మాస్క్ మ్యాన్ హరీష్( harish) తన అభిప్రాయం చెప్పాడు. దీంతో అంతా కలిసి మీరు గార్డెన్ ఏరియాకు వెళ్లి ఫుడ్ తినొచ్చు అంటూ సెలబ్రెటీలకు చెప్పారు. అయితే దీనివల్ల ఏమైనా పరిణామాలు ఎదుర్కోవాలసి వస్తే అని సెలబ్రెటీలు అనగానే దమ్ము శ్రీజ (dhammu srija) మేం తీసుకుంటామని సమాధానం ఇచ్చింది.
ఈ సంభాషణ జరుగుతుండగానే ఓనర్స్ అంతా లివింగ్ ఏరియాకు రావాలని, టెనెంట్స్ హౌస్ ముందు నిల్చోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఆహారం మొత్తం స్టోర్ రూంలో పెట్టాలని, టెనెంట్స్ ఇంట్లోకి వెళ్లడానికి వీళ్లేదని ఫైర్ అయ్యాడు. అయినప్పటికీ వినకుండా మరోసారి శ్రీజ సెలబ్రెటీల వద్దకు వెళ్లి మీకు పనిష్మెంట్ ఇస్తే నేను తీసుకుంటా..మీకు రానివ్వను అని చెప్పింది. దీంతో బిగ్ బాస్ అదే సీరియస్ గా తీసుకుని హౌస్ మొత్తానికి పనిష్మెంట్ ఇస్తే ఏం చేయాలి అంటూ తనూజ కరెక్ట్ పాయింట్ మాట్లాడింది.
తరవాత ధరణి (dharani) మాట్లాడుతూ.. మనం ఓనర్ల ప్రైవసీని ఎక్కడా డిస్ట్రబ్ చేయట్లేదు, వాళ్లలో ఎవరికైనా ఆలోచన వస్తే వచ్చి మనల్ని డిస్ట్రబ్ చేస్తున్నారు. ఒకఅమ్మాయి వచ్చి ఇది రాసుకో అని ముఖాన రాసి వెళ్లిపోతుంది. ఇంకో అమ్మాయి వచ్చి నువ్వు ఇది తిను అని తినిపిస్తుంది. ఏంటి ఇది... అంటూ కామనర్లను ప్రశ్నించాడు. దీంతో తొలిరోజే హౌస్‌లో హీట్ పెరిగినట్టు కనిపించింది. అసలు బిగ్ బాస్ చివరికి ఫుడ్ తినడానికి మళ్లీ అనుమతి ఇచ్చాడా? హౌస్‌లో ఎలాంటి గొడవలు జరిగాయి అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.






