- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIGG BOSS-9: బిగ్ బాస్ 9.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు వీళ్లే
తెలుగువాళ్ల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. హోస్ట్ నాగార్జున వెల్ కమ్ చెబుతుండగా తమదైన రీతిలో కంటెస్టెంట్లు వీర లెవల్లో ఎంట్రీ ఇస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగువాళ్ల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. హోస్ట్ నాగార్జున వెల్ కమ్ చెబుతుండగా తమదైన రీతిలో కంటెస్టెంట్లు వీర లెవల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి సీరియల్ నటి తనుజ పుట్టస్వామి అడుగుపెట్టింది. ఆమె తరవాత రెండో కంటెస్టెంట్ గా ఒకప్పటి హీరోయిన్ ఫ్లోరా సైనీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరి తరవాత కామన్ మ్యాన్‌గా కల్యాణ్ పడాల హౌస్ లోకి అడుగుపెట్టాడు.
హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి కామన్ మ్యాన్ ఇతడే. కల్యాణ్ పడాల ఎంట్రీ తరవాత ఎంతో మంది ఫేవరెట్ జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇమ్మాన్యుయేల్ ఎంట్రీతో ఈ సారి హౌస్‌లో నవ్వులే నవ్వులు ఉంటాయని అర్థమౌతోంది. ఇమ్మాన్యుయేల్ తరవాత ఐదవ కంటెస్టెంట్‌గా లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ హౌస్‌లోకి అడుగుపెట్టింది. జానీ మాస్టర్ పై రేప్ కేసు తరవాత శ్రష్ఠి పేరు వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టడంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
ఆరవ కంటెస్టెంట్‌గా హరిత హరీష్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తరవాత సీరియల్‌లో విలన్ రోల్స్‌తో అదరగొడుతూ సినిమాల్లో నటించే భరణి ఎంట్రీ ఇచ్చాడు. భరణి తరవాత బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ పేరు కూడా చాలా కాలంగా వినిపిస్తోంది. ఫుల్ గ్రేస్‌తో పవన్ కల్యాణ్ మ్యానరిజం చూపిస్తూ హౌస్‌లోకి అడుగుపెట్టింది. రీతూ తరవాత మళ్లీ కామన్ మ్యాన్‌గా డెమోన్ పవన్ ఎంట్రీ ఇచ్చాడు. డెమోన్ పవన్ సోషల్ మీడియాలో డ్యాన్స్ రీల్స్ ద్వారా పాపులర్ అయ్యాడు.
పవన్ తరవాత ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో త్రిషకు చెల్లిగా నటించిన సంజన గర్జానీ ఎంట్రీ ఇచ్చింది. సంజన బుజ్జిగాడుతో పాటు చాలా సినిమాల్లో ఆర్టిస్ట్‌గా నటించింది. అనంతరం జానపద పాటలతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు. రాము రాథోడ్ చేసిన రాను ముంబాయికి రాను పాట యూట్యూబ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఇక పదమూడో కంటెస్టెంట్‌గా కమిడియన్ సుమన్ శెట్టి అడుగుపెట్టాడు. సుమన్ శెట్టి చాలా సినిమాల్లో హీరో స్నేహితుడి పాత్రల్లో నటించి నవ్వులు పూయించాడు.
మరో కామన్ మ్యాన్‌గా మర్యాద మహేశ్ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీముఖి స్పెషల్ రిక్వెస్ట్‌తో మహేశ్‌కు ఎంట్రీ లభించింది. తరవాత కామన్ ఉమెన్‌గా ప్రియా శెట్టి హౌస్‌లోకి అడుగుపెట్టింది. ప్రియా హౌస్‌లోకి రాకముందే క్యూట్ లుక్స్‌తో అభిమానులను సంపాదించుకుంది. ఇక మరో కామన్ ఉమెన్‌గా శ్రీజ దమ్ము ఎంట్రీ ఇచ్చింది. గళగళా మాట్లాడుతూ శ్రీజ ఎంట్రీ ఇవ్వడంతో గొడవలు పక్కా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. పదిహేనవ కంటెస్టెంట్‌గా మర్యాద మనిష్ హౌస్‌లో అడుగుపెట్టాడు.






