- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బాస్ వాయిస్ ఏంటి ఇంత కామెడీగా ఉంది.. పాత బిగ్ బాస్ కావాలి..!
బుల్లితెరపై ప్రచారం అవుతున్న షోలలో ‘బిగ్ బాస్’ ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రచారం అవుతున్న షోలలో ‘బిగ్ బాస్’ ఒకటి. రియాలిటీ షోగా మంచి పేరు తెచ్చుకున్న బిగ్ బాస్.. 6 సీజన్ల పూర్తి చేసుకుని ఇప్పుడు 7వ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీజన్ మాత్రం గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్ కొంచెం వెరైటీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ అంటే మొదట గుర్తొచ్చేది బిగ్ బాస్ వాయిస్. ఆ వాయిస్‌తోనే హౌస్‌లో ఎంత పెద్ద గొడవ అయిన చిటికెలో సైలెన్స్ అయిపోతుంది. ఆ వాయిస్ వినగానే ప్రేక్షకుల్లో ఒకరకంగా గూస్ బంప్స్ వచ్చేవని చెప్పుకోవాలి. అంత గంభీరంగా ఉండేది. అయితే.. ఇప్పుడు బిగ్ బాస్ వాయిస్ వింటుంటే చాలా కామెడీగా ఉందంటూ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రతిసారి డబ్బింగ్ చెప్పిన వ్యక్తి కాకుండా కొత్తగా ఎవరో వాయిస్ చేసినట్లు ఉంది. పాత వ్యక్తితోనే డబ్బింగ్ చెప్పించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.






