తనూజకు ఇచ్చి పడేసిన దివ్య.. సోషల్ మీడియా మొత్తం అదే టాపిక్..(వీడియో)

by Sujitha Rachapalli |

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 దాదాపు ఫైనల్‌కు చేరుకుంది. ఏ కంటెస్టెంట్‌లో ఏ వీక్‌నెస్ ఉంది? ఏ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి? అనేది చూస్తున్న ఆడియన్స్‌కు.. ఇంట్లో ఉన్న ఇంటి సభ్యులకు కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయింది. చివరి అంకానికి దగ్గర్లో ఉంది కాబట్టి ఫ్రెండ్‌షిప్స్ విడిచి..

తనూజకు ఇచ్చి పడేసిన దివ్య.. సోషల్ మీడియా మొత్తం అదే టాపిక్..(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 దాదాపు ఫైనల్‌కు చేరుకుంది. ఏ కంటెస్టెంట్‌లో ఏ వీక్‌నెస్ ఉంది? ఏ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి? అనేది చూస్తున్న ఆడియన్స్‌కు.. ఇంట్లో ఉన్న ఇంటి సభ్యులకు కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయింది. చివరి అంకానికి దగ్గర్లో ఉంది కాబట్టి ఫ్రెండ్‌షిప్స్ విడిచి.. సోలో గేమ్ ఆడటంపై దృష్టిపెడుతున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే.. కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించాలనుకుంటున్న కంటెస్టెంట్స్ ఎవరో కారణాలతో సహా చెప్పాలని సూచించాడు బిగ్ బాస్. దీనికి ఈ వారం కెప్టెన్‌గా ఉన్న తనూజ.. ఒక్కొక్కరుగా వచ్చి తమ పాయింట్స్ చెప్పాలని సూచించింది. కానీ ఎవరు లేవకపోవడంతో ముందుగా దివ్య తన కారణాలు చెప్పేందుకు ముందుకొచ్చింది.

ఇప్పటికే తనూజకు రెండు వారాల ఇమ్యూనిటీ లభించింది కాబట్టి మళ్లీ కెప్టెన్ అయితే మళ్లీ ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి ఆమెను ఈ కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఎప్పటిలాగానే దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయిన తనూజ.. దివ్య బిహేవియర్ గురించి మాట్లాడటంతో.. తప్పు తప్పుగా మాట్లాడొద్దని దివ్య ఫైర్ అయిపోయింది. తాను రీజన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పగా.. చెప్పింది చాలు పో.. అని వెటకారం చేసిన తనూజ.. పర్సనల్ ఎటాక్‌కు దిగింది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తనూజను తిట్టిపోస్తున్నారు జనాలు. ప్రతి దానికి ఏడుస్తుందని.. దేన్నీ యాక్సెప్ట్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు.

VIDEO

Next Story