బిగ్‌బాస్-9: ట్విస్ట్ అదిరిపోయిందిగా.. ఏకంగా కెప్టెన్సీ పోటీతో హౌస్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అశ్వద్ధామ!

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:55:29  IST  )

బిగ్‌బాస్ సీజన్-9 అన్ని సీజన్లకు భిన్నంగా కొనసాగుతోంది. ఇందులో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

బిగ్‌బాస్-9: ట్విస్ట్ అదిరిపోయిందిగా.. ఏకంగా కెప్టెన్సీ పోటీతో హౌస్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అశ్వద్ధామ!
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 అన్ని సీజన్లకు భిన్నంగా కొనసాగుతోంది. ఇందులో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే ఒక్కసారి ఇంటినుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మరోసారి ఇంట్లోకే వెళ్లే చాన్స్ ఉండేది కాదు. కానీ ఈ 9వ సీజన్‌లో మాత్రం ఊహించని విధంగా కొందరు బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఇంట్లోకి వెళ్లి టాస్కుల్లో పాల్గొంటున్నారు. ఎలిమినేట్ బయటకు వచ్చాక.. హౌస్‌మెట్స్ కారణంగా సంజన, దమ్ము శ్రీజ మళ్లీ ఇంట్లోకి వెళ్లగా.. శ్రీజ బయటకు వచ్చేసింది. కానీ సంజన ఇంకా ఇంట్లోనే తన సత్తా చాటుతోంది. ఇక ఇటీవల నామినేషన్స్‌లో భాగంగా ఈ సీజన్లు పాల్గొని ఎలిమినేట్ బయటకు వెళ్లిన కంటెస్టెంట్స్‌ను కూడా బిగ్‌బాస్ మళ్లీ ఇంట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఈ వారం ఏకంగా గత సీజన్‌లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్‌ను ఏకంగా కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడేందుకు రావడం గమనార్హం. ఇక లేటెస్ట్ ప్రోమో చూసిన వారు ఇదేం ట్విస్ట్ అని ఆశ్చర్యపోతున్నారు. 12వారంలో భాగంగా కెప్టెన్ అయ్యేందుకు భరణి(Bharani)తో పాటు గత సీజన్‌కు చెందిన ఓ కంటెస్టెంట్ వచ్చాడు. అసలు విషయంలోకి వెళితే.. భరణితో పోటీ పడేందుకు గత సీజన్‌లో అశ్వద్ధామ అంటూ హడావిడి చేసి రన్నరప్‌గా నిలిచిన గౌతమ్ కృష్ణ (Goutham Krishna)సీజన్ 9లోకి ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా.. ఇందులో భరణి, గౌతమ్ పోటీ పడ్డారు. కానీ ఎవరు గెలిచారనేది బిగ్‌బాస్ చూపించకుండా చివరకు హౌస్‌మెట్స్ అంతా భరణి చుట్టు చేరినట్లుగా చూపించారు. అంతటితో ప్రోమోను ముగించేశారు. ఇక ఇది చూసిన వారంతా.. ట్విస్ట్ అదిరిపోయింది కానీ గౌతమ్ కృష్ణ మళ్లీ కంటెస్టెంట్‌గా వస్తున్నాడా.. లేదా ఆ గేమ్ ఆడి వెళ్లిపోతాడా అనేది అర్థం కాక బిగ్‌బాస్ అసలు ఏం ప్లాన్ చేశాడని ఆలోచిస్తున్నారు.

Next Story