బిగ్‌బాస్-9: తన గోతి తనే తవ్వుకున్న శ్రీజ.. ఐదు వారాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-13 07:15:08  IST  )

బిగ్‌బాస్-9(Bigg Boss-9) రియాలిటీ షో ఆరో వారంలోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే.

బిగ్‌బాస్-9: తన గోతి తనే తవ్వుకున్న శ్రీజ.. ఐదు వారాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే?
X

దిశ, సినిమా: బిగ్‌బాస్-9(Bigg Boss-9) రియాలిటీ షో ఆరో వారంలోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే. ఇందులో ఆరుగరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక ఐదో వారంలో ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో ఫ్లోరా ఇంటి నుంచి బయటకు రాగా.. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో భాగంగా కామనర్ దమ్ము శ్రీజ(sreeja) కూడా ఎలిమినేట్ అవడం గమనార్హం.

దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆటలో ఆడ,మగ తేడా లేకుండా అందరిపైనా విరుచుకు పడిన శ్రీజకు ఎదురుదెబ్బ తగిలింది. గేమ్ స్ట్రాటజీతో తన గొతిలో తనే పడినట్లు అయింది. తన స్నేహితుడు పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన మాట కోసం కెప్టెన్ చేసింది. గత వారం ఇంటి సభ్యులను జంటలుగా విడిపోమంటే.. శ్రీజ అతి కళ్యాణ్‌తో కాకుండా సుమన్ శెట్టితో జత కట్టింది. ఫ్రెండ్స్ కాబట్టి ఒకే జట్టులో ఉంటే హౌస్‌మెట్స్ టార్గెట్ చేస్తారని భావించి అలా చేసింది.

దీంతో కళ్యాణ్ తనూజ జతకట్టారు. ఇక గేమ్స్ అన్నీ అయిపోయేసరికి పవన్ తనూజ‌తో పాటు మిగతా జంటలన్నీ సేఫ్ అయ్యాయి. కానీ చివరకు సుమన్, శ్రీజ మాత్రమే డేంజర్‌ జోన్‌లో పడ్డారు. శ్రీజ స్ట్రాటజీ కళ్యాణ్‌కు కలిసొచ్చినప్పటికీ.. ఆమె ప్లాన్ రివర్స్ అవడంతో బలిపశువు అయింది. చివరకు ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఇప్పుడు శ్రీజ రెమ్యునరేషన్ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కామన్‌మ్యాన్ క్యాటగిరీలో ఉన్న శ్రీజకు వారానికి 60 వేల చొప్పున రెమ్యునరేషన్ ఇవ్వగా.. ఐదు వారాలకు ఏకంగా రూ. 3. నుంచి రూ. 3. 50 లక్షల మేర అందుకున్నట్లు తెలుస్తోంది.

Next Story