బిగ్‌బాస్-9: షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి ఊహించని కంటెస్టెంట్ అవుట్!

by Mallepaka Hamsa |

బిగ్‌బాస్-9(Bigg Boss-9) రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. సెలబ్రిటీలు, వర్సెస్ కామనర్స్ పోటాపోటీగా టాస్కుల్లో పాల్గొంటున్నారు.

బిగ్‌బాస్-9: షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి ఊహించని కంటెస్టెంట్  అవుట్!
X

దిశ, సినిమా: బిగ్‌బాస్-9(Bigg Boss-9) రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. సెలబ్రిటీలు, వర్సెస్ కామనర్స్ పోటాపోటీగా టాస్కుల్లో పాల్గొంటున్నారు. మొత్తం 15 మంది ఇంట్లోకి వెళ్లగా.. అనూహ్యంగా.. ఒక్కో వారానికి ఒక్కొక్కరి చొప్పున ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తున్నారు. మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవ్వగా.. ఆ తర్వాత మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్ ఇంట్లోంచి వచ్చేశారు. ఈక్రమంలోనే.. దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఐదో వారం పూర్తి కావొస్తుండగా.. ఈ సారి రామ్ రాథోడ్, ఇమాన్యుయేల్, సేఫ్ జోన్‌లో ఉండగా.. దమ్ము శ్రీజ, తనూజ, కళ్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, సంజనా, ఫ్లోరా, సుమన్ శెట్టి, భరణి, దివ్య నామినేట్ అయి డేంజర్‌లో ఉన్నారు.

ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో ఫ్లోరా షైనీ(Flora Shiny) ఓట్లు తక్కువ పడటంతో ఇంట్లో ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసినట్లు సమాచారం. ఆ తర్వాత కామనర్స్ కేటగిరీలో అగ్నిపరీక్ష ఎదుర్కొని హౌస్‌లోకి వచ్చిన దమ్ము శ్రీజ(dammu sreeja) కూడా బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అందరికీ దీటుగా పోటీ ఇచ్చినప్పటికీ ఆట మీద కాకుండా ఇతర పంచాయతీల మీ దృష్టి పెట్టడంతో నెగెటివిటీ ఎక్కవై ఓట్లు తక్కువగా వచ్చినట్లు టాక్. ఈ సారి డబుల్ ఎలిమినేషన్స్‌లో ప్రేక్షకులంతా షాక్ అవుతున్నారు. ఇక ఆరు వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story