బిగ్‌బాస్-9: హౌస్‌లో ఊహించని సీన్.. ఇంటి నుంచి ఆమె ఔట్.. కళ్ళు తిరిగి పడిపోయిన మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్?

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:36:48  IST  )

బిగ్‌బాస్ షోలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారితో పాటు పాత కంటెస్టులు టాస్కుల్లో పాల్గొంటున్నారు.

బిగ్‌బాస్-9: హౌస్‌లో ఊహించని సీన్.. ఇంటి నుంచి ఆమె ఔట్.. కళ్ళు తిరిగి పడిపోయిన మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్?
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ షోలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారితో పాటు పాత కంటెస్టులు టాస్కుల్లో పాల్గొంటున్నారు. ఇక వైల్డ్ కార్డ్‌తో వచ్చిన వారంతా తమ సత్తా చూపిస్తూ ఇంట్లో దుమ్మురేపుతున్నారు. ఈక్రమంలో.. బిగ్‌బాస్ హౌస్ ఊహించని ఘటన చోటుచేసుకుంది. వైల్డ్ కార్డ్‌తో వచ్చిన సీరియల్ నటి ఆయేషాకు డెంగ్యూ జ్వరం రావడంతో ఆమెను ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఆమె కనిపించకపోవడంతో అంతా ఆశ్చర్యపోతూ అన్ని వీడియోల్లో చెక్ చేస్తుండగా.. ఈ విషయం బయటపడింది. ఇక లేటెస్ట్ ప్రోమో విడుదలవగా.. ఇందులో హౌస్‌‌మెట్స్ కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొంటూ కనిపించారు. సర్కిట్‌లో టోపీ పెట్టారు.. బజర్ మోగినప్పుడు ఎవరో ఒకరు తీసుకుని టోపీని చేజిక్కించుకున్న వ్యక్తి.. కెప్టెన్సీ రేసులో లేనివాళ్లకు ఇవ్వాలి. వారు కెప్టెన్‌గా ఎవరిని చూడొద్దనుకుంటున్నారో వారిని ఈ రేసు నుంచి తప్పించాలి.

అలాగే నిఖిల్ పోటీ పడి చేతిలో టోపిని గౌరవ్‌కి ఇవ్వగా కళ్యాణ్‌ను ఎలిమనేట్ చేశాడు. ఆ తర్వాత ఇమాన్యుయేల్‌ (Emmanuel)టోపిని సంజనకు అందించగా.. ఆమె దివ్యను తొలగించింది. మరో రెండు మాధురికి ఇవ్వగా నిఖిల్(nikhil), రీతూలను ఎలిమినేట్ చేసింది. ఇమాన్యుయేల్ తనూజ (tanuja)మిగలగా.. చివరకు ఇమ్ము గెలిచాడు. అంతా బాగానే ఉందనుకునే క్రమంలోనే.. కెప్టెన్సీ చేజారడంతో తనూజ అక్కడిక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. దీంతో అది గమనించిన హౌస్‌మెట్స్ అంతా కంగారుపడిపోతారు. మెడికల్ రూమ్‌లోకి తీసుకెళ్తుండగానే.. ప్రోమో అయిపోయింది. దీంతో అసలు తనూజకు ఏమైందని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ ఆయేషా, తనూజ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కు ఇలా జరగడం అందరినీ బాధకు గురి చేస్తోంది.

Next Story