బిగ్‌బాస్-9: ఎట్టకేలకు అతనిపై ప్రేమను బయటపెట్టిన రీతూ.. హౌస్ అంతా ఆ ఇద్దరి గురించే చర్చ! (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-20 11:35:57  IST  )

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ రెండో వారం కొనసాగుతోంది. ఇందులో 14మంది కంటెస్టెంట్స్ టాస్కుల్లో పాల్గొంటూ దుమ్మురేపుతున్నారు.

బిగ్‌బాస్-9: ఎట్టకేలకు అతనిపై ప్రేమను బయటపెట్టిన రీతూ.. హౌస్ అంతా ఆ ఇద్దరి గురించే చర్చ! (వీడియో)
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ రెండో వారం కొనసాగుతోంది. ఇందులో 14మంది కంటెస్టెంట్స్ టాస్కుల్లో పాల్గొంటూ దుమ్మురేపుతున్నారు. ఇందులో 8మంది కంటెస్టెంట్స్, 6 మంది సామాన్యులు ఉండగా.. మొదటి వారం సైలెంట్‌గా ఉన్నవారంతా.. ఇప్పుడు ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. అన్ని టాస్కుల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ ప్రేక్షకుల్లో పాపులారిటీ పెంచుకుంటున్నారు. అలాగే లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికర సీన్ జరిగింది. మొదటి నుంచి రీతూ చౌదరి, పవన్ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ వారిద్దరే పలు చోట్ల కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.

ఇక ఈరోజు ఎపిసోడ్‌లో ఏకంగా రీతూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ చపాతీని హార్ట్ సింబల్‌గా వేసి పవన్‌కి ఇచ్చింది. దీంతో అతను ఆమె దగ్గరకు వెళ్లి థాంక్స్ చెబుతుండగా.. చీరలో తెగ సిగ్గు పడిపోయింది. ఇక వీరి గురించి ఇమాన్యుయేల్‌తో తనూజ ఆమె గేమ్ ఆడటానికి వచ్చిందా వాళ్లతో ఉండటానికి వచ్చిందా అని అంటుంది. అలాగే ఇమ్ము కూడా మనీష్‌తో పవన్‌ను రీతూ చెప్పినట్లు వినేలా చేసుకుందని అంటాడు. ఓ వైపు రీతూ కూడా తనతో తనూజ మాట్లాడటం లేదని.. ఇమాన్యుయేల్‌కు గేమ్‌లో రెండు అవకాశాలు ఇచ్చినట్లు చెప్పడంతో ప్రోమో అయిపోయింది. ఈ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.

Next Story