Bigg Boss-9: హౌస్‌లోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో!

by Mallepaka Hamsa |

సెప్టెంబర్ 7న ప్రారంభమైన తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ -9 తొమ్మిదో వారానికి చేరుకుంది.

Bigg Boss-9: హౌస్‌లోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో!
X

దిశ, సినిమా: సెప్టెంబర్ 7న ప్రారంభమైన తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ -9 తొమ్మిదో వారానికి చేరుకుంది. ఈ తొమ్మిది వారాల్లో కొందరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు పోగా.. ఇటీవల ఆరుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. కంటెస్టెంట్ల ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు, టాస్క్‌లతో ఉత్కంఠభరితంగా సాగుతోన్న బి గ్ బాస్ హౌస్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పలు టాస్కులతో ప్రేక్షకుల్లో ఎంతగానో ఆదరణ పొందుతున్న ఈ షోలో పోలీసుల ఎంట్రీతో అంతా షాక్ అయ్యారు. మేము ఎస్సైలం అని చెప్పడంతో.. వారు ఎందుకు వచ్చారో అర్థంకాక కంటెస్టెంట్స్ అంతా గార్డెన్ ఏరియాకు వచ్చేసి లైన్‌లో నిల్చున్నారు. అదేంటి బిగ్ బాస్ హౌస్ లోకి పోలీసులు రావడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? తాజాగా ‘బిగ్ బాస్ సీజన్-9’ 46వ రోజుకు సంబంధించి ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

ఇందులో ఇద్దరు ఎస్సైల ఎంట్రీతో హౌస్ అంతా అతలాకుతలం అయింది. అందరూ ఒకేచోట చేరి టెన్షన్ పడుతూ కనిపించగా.. కానీ మాధురి, సంజన మాత్రం కిచెన్‌లో దాక్కున్నారు. ఇందులోకి పోలీసులుగా ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్(Ambati Arjun), అమర్ దీప్ (amar deep)మాత్రం అన్ని గదులను క్షుణ్ణంగా సెర్చ్ చేశారు. ఈ క్రమంలో వంట గదిలో ఉండాల్సిన సామాగ్రి అంతా బెడ్ రూమ్‌లోనే ఉందేంటి? అని అమర్ దీప్ ఆశ్చర్యపోతూ ఒక్కొక్కటి బయటకు తీశాడు. ఎగ్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్.. ఇలా చాలానే అమర్ దీప్ చేతికి దొరికాయి. అయితే అందులో కొన్నింటినీ అతనే జేబులో పెట్టుకున్నాడు. అంతటితో ప్రొమో ముగుస్తుంది. ఇంతకీ ఆ పోలీసులకు దాకున్న సంజన, మాధురి దొరికారా? లేదా అన్నది నేటి ఎపిసోడ్‌లో చూపించనున్నారు.

link

Next Story