Bigg Boss-9: నా వల్ల కావడం లేదు.. ఇంటికి పంపించమంటూ బోరున ఏడుస్తున్న ప్రభాస్ మరదలు.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-15 06:00:39  IST  )

బిగ్‌బాస్-9 (Bigg Boss-9)ఐదోవారంలో భాగంగా నామినేషన్స్‌లో ఉన్న వారిని సేవ్ చేసేందుకు పలు టాస్కులు ఇస్తున్న విషయం తెలిసిందే.

Bigg Boss-9: నా వల్ల కావడం లేదు.. ఇంటికి పంపించమంటూ బోరున ఏడుస్తున్న ప్రభాస్ మరదలు.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: బిగ్‌బాస్-9 (Bigg Boss-9)ఐదోవారంలో భాగంగా నామినేషన్స్‌లో ఉన్న వారిని సేవ్ చేసేందుకు పలు టాస్కులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ వారం నామినేషన్స్ కెప్టెన్‌గా ఉన్న రాము రాధోడ్, ఓ టాస్కులో గెలిచిన ఇమాన్యుయేల్ తప్ప.. మిగతా వరంతా డేంజర్‌లో ఉన్నారు. ఇక వారిని జంటలుగా చేసి పలు టాస్కులు నిర్వహిస్తుండగా.. ఇందులో కొందరు బాగానే మార్కులు తెచ్చుకున్నారు. ఇక ఇందులో మొదటి స్థానాన్ని దక్కించుకున్న దివ్య(divya)-భరణి(bharani)కి ఓ బంపర్ ఆఫర్ ఇస్తాడు. చివరి స్థానాల్లో ఉన్న ఫ్లోరా-సంజన, శ్రీజ సుమన్‌లలో నుంచి ఒక జట్టును రేసు నుంచి తప్పించాలని అనడంతో వారు సంజన జంటను తొలగిస్తారు. దీంతో ప్రభాస్ మరదలుగా ఓ సినిమాలో నటించిన సంజన ఫిజికల్ టాస్కులు ఉంటాయని నాకు తెలీదు.

అబ్బాయిల శరీరంపై నుంచి ఎలా దూకాలి బిగ్‌బాస్? నేనెప్పుడూ అలా చేయలేదు. ఇలాగైతే నేనుండలేను.. దయచేసి నన్ను ఇంటికి పంపండి అని బోరున ఏడ్చేసింది. సుమన్ శెట్టిపై నేనెలా దూకాలి. అమ్మాయిలతో అయితే పర్లేదు.. కానీ అబ్బాయిలతో ఎలా అని ప్రశ్నించింది. ఆ తర్వాత పలు గేమ్స్ నిర్వహించగా.. ఇందులో భరణి, దివ్య, కళ్యాణ్ సేఫ్ జోన్‌కి వెల్లగాజజ మిగిలినవారు తనూజ, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, ఫ్లోరా, సంజన, దమ్ము శ్రీజ, డిమాన్ పవన్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇక ఈ ప్రొమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు.. ఫ్లోరా, సంజన సూపర్‌గా ఆడుతుంటే.. వాళ్లను గేమ్ నుంచి తొలగించడం అన్యాయం అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story