బిగ్‌బాస్-9: అగ్ని పరీక్షలో ప్రతీ సీన్ క్లైమాక్సే.. ప్రోమోతోనే చెమటలు పట్టించేసిన టీమ్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-22 15:03:18  IST  )

ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షో త్వరలో రాబోతుంది.

బిగ్‌బాస్-9: అగ్ని పరీక్షలో ప్రతీ సీన్ క్లైమాక్సే.. ప్రోమోతోనే చెమటలు పట్టించేసిన టీమ్
X

దిశ, సినిమా: ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షో త్వరలో రాబోతుంది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ హైపర్ ఎంటర్‌టైన్‌మెంట్ షో సీజన్ 9 ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సీజన్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సారి డబుల్ హౌస్.. డబుల్ డోస్ అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లబోతున్నారు. అప్లై చేసుకోవాలనడంతో.. హౌస్‌లోకి వెళ్తేందుకు వేలాది మంది అప్లికేషన్లు వచ్చాయి. అందులోంచి బిగ్‌బాస్ టీమ్ కేవలం 40 మందిని సెలెక్ట్ చేసుకుని కఠిన టాస్కులు పెట్టి చివరకు 15 మందిని సెలెక్ట్ చేశారు.

అగ్ని పరీక్ష పేరుతో ఓ ప్రీ- షో నిర్వహించగా.. ఇందులో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తుండగా.. అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జెస్‌గా చేస్తున్నారు. ఈ షో హాట్ స్టార్‌లో ప్రసారం అవుతోంది. దీంతో ఇందులో ఈ ముగ్గురి ప్రవర్తన చూసిన నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, బిగ్‌బాస్ సీజన్-9షో ప్రసారానికి సమయం దగ్గర పడుతుండటంతో ‘అగ్ని పరీక్ష’లో ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో ఓ 15 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. బిందు మాధవి ఏ పోటీ పడినా జీవితంలో లక్ కూడా ఉండాలని చెప్తుంది. ఆ తర్వాత అందరితో ఓ పండుని తీయిస్తారు. ఈక్రమంలోనే నవదీప్ ప్రతి సీన్ క్లైమాక్స్‌లా ఉంటదని చెప్తాడు. అలాగే ఎవరు ఏ జూరిని నమ్మి ఏ కార్డు తీసుకుంటారో.. దాన్ని బట్టి హౌస్‌లోకి వెళ్తారని అంటాడు. అయితే పరీక్ష ముందు పరీక్ష పెట్టినట్లు కన్ఫర్మ్ చేస్తాడు. అందులో ఎవరు సెలెక్ట్ అవుతారో.. ఎవరు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో ఓ 5 మందిని మాత్రమే హౌస్‌లోకి పంపనున్నట్లు సమాచారం.

Next Story