Bigg Boss-9: హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. మొదటి వారం కెప్టెన్సీని దక్కించుకునది ఎవరంటే!

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-16 13:21:40  IST  )

బిగ్‌బాస్ సీజన్-9 రోజు రోజుకు చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి 9మంది సెలబ్రిటీలు,6 మంది సామాన్యులు హౌస్‌లోకి వెళ్లారు.

Bigg Boss-9: హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. మొదటి వారం కెప్టెన్సీని దక్కించుకునది ఎవరంటే!
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 రోజు రోజుకు చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి 9మంది సెలబ్రిటీలు,6 మంది సామాన్యులు హౌస్‌లోకి వెళ్లారు. అయితే ఇంట్లో సెలబ్రిటీలు, సామాన్యులు పలు టాస్కులు ఆడుతూ, వాదనలు పెట్టుకుంటూ జనాలను చిరాక్ వచ్చేలా చేస్తున్నారు. ఇక ఇటీవల ప్రభాస్ మరదలు సంజనా(Sanjana)ను సామాన్యులంతా కలిసి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయి బయటకు వచ్చేయనుందనే వార్తలు వచ్చాయి. ఈక్రమంలోనే.. కెప్టెన్సీ టాస్క్‌ పెడతాడు. కానీ వాళ్లు కాకుండా సపోర్టర్స్ ఆడారు.

ఇందులో సంజనా బదులు శ్రీజ ఆడగా.. విన్నర్‌గా నిలవడంతో కెప్టెన్సీని సంజనా దక్కించుకుంది. ఆ తర్వాత తన లగేజీని రూమ్‌లోకి షిఫ్ట్ చేయమని ఫ్లోరాకు చెప్తే తను చేయనని చెప్తుంది. దీంతో సంజనా తనకు వార్నింగ్ ఇస్తుంది. ఈనేపథ్యంలోనే బిగ్‌బాస్ చాక్లెట్లు, చిప్ప పంపిస్తే.. కామనర్లు ప్రియ(priya), శ్రీజ(sreeja) కొట్టేశారు. గతంలో ఒక్క గుడ్డు తిన్నందుకే ఆమెను రెండు రోజులు ఇంట్లోకి రానివ్వని వాల్లు ఇప్పుడు ఇలా చేయడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సంజనా ఎలిమినేట్ అవ్వకుండా ఇంట్లో ఉంటుందని అంతా భావిస్తున్నారు.

Next Story