- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ 9 విన్నరెవరో చెప్పేసిన నిఖిల్.. ఆమె మాత్రం కాదని క్లారిటీ
బిగ్ బాస్ సీజన్ 9.. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్ క్లైమాక్స్ దశకు చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 9.. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్ క్లైమాక్స్ దశకు చేరింది. హౌస్ లో టాప్ 5 కంటెస్టంట్స్ ఉన్నారు. నేడో రేపో.. విన్నర్ ఎపిసోడ్ షూటింగ్, సండే టెలీకాస్ట్ అవుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరన్న దానిపై గత సీజన్ల విన్నర్లు, రన్నర్లు తమకు తెలిసిన, నచ్చిన పేర్లను చెప్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయంపై బిగ్ బాస్ సీజన -8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ తన అభిప్రాయం, ఫైనల్ లో విన్నర్ గా తన ఓటు ఎవరికో చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
గత సీజన్ మాజీ కంటెస్టంట్ అయిన టేస్టీ తేజ.. ఈసారి విన్నర్ ఎవరనుకుంటున్నావ్ అని నిఖిల్ ను అడగ్గా.. తన ఆన్సర్ ఇచ్చాడు. తనూజ మాత్రం కాదని చెప్తూనే.. ఇమ్మాన్యుయేల్ లేదా పవన్ లలో ఎవరో ఒకరు విన్నర్ గా నిలిచి టైటిల్ అందుకుంటారని చెప్పుకొచ్చాడు. నిఖిల్ అభిప్రాయంపై నెట్టింట విభిన్న కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా తనూజ విన్నర్ కాదని చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. నువ్వు అలా ఎలా చెప్తావంటూ తిడుతున్నారు. ఈ సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో తెలియాలంటే మరో రెండ్రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం హౌస్ లో ఇమ్మాన్యుయేల్, నిక్కీ గల్రానీ, డిమోన్ పవన్, తనూజ, కల్యాణ్ లు ఉన్నారు.






