Bigg Bogss-7: ఆరో వారం ఎలిమినేషన్.. కొత్త బ్యూటీ ఔట్? బిగ్ బాస్ ట్విస్ట్‌లు తట్టుకోలేకపోతున్న ప్రేక్షకులు!

by sudharani |   ( Updated:2023-10-14 10:33:09.0  )
Bigg Bogss-7: ఆరో వారం ఎలిమినేషన్.. కొత్త బ్యూటీ ఔట్? బిగ్ బాస్ ట్విస్ట్‌లు తట్టుకోలేకపోతున్న ప్రేక్షకులు!
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్-7 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్, ఎలిమినేషన్స్ అంటూ కంటెస్టెంట్స్‌లకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాడు బాగ్ బాస్. ఇక ఇప్పటి వరకు ఐదుగురు ఎలిమినేట్ కాగా.. మరో ఐదుగురు హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే.. ఈ వారం నామినేషన్స్‌లో శోభా శెట్టి, తేజా, నయని పావని, అమర్ దీప్. పూజా మూర్తి, అశ్విని శ్రీ, ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరు అని ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ వారం నామినేషన్స్‌లొ శోభాశెట్టికి తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కొంత మంది అయితే ఏకంగా.. ‘ప్లీజ్ బిగ్ బాస్ ఆ శోభా శెట్టిని భరించలేక పోతున్నాం.. దయచేసి ఆ కన్నింగ్ కిలేడీనీ బయటకు పంపించేయండి’ అంటూ నెట్టింట్ల కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ వారం శోభా శెట్టినే ఎలిమినేట్ అవుతాదని అందరూ ఊహిస్తున్నారు.

కానీ, బిగ్ బాస్ హౌప్ లోకి వెళ్లే ముందే ఎన్ని వారాలన్నది అగ్రిమెంట్ ఉంటుందట. దాని ప్రకారం శోభా అప్పుడే వెళ్లే పరిస్థిదే లేదని టాక్. అంతే కాకుండా ఆమెను సేవ్ చేయడానికి ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావనీని ఎలిమినేట్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే.. లాస్ట్ వీక్ శుభశ్రీ కూడా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అయినట్లుగానే ఇప్పుడు నయని పావనీది కూడా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని అభిప్రాయపడుతారు నెటిజన్లు. ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే రేపటి ఎలిమినేషన్ వరకూ వేచి చూడాల్సిందే..

Read More about Bigg Boss Telugu season 7

Advertisement

Next Story