ఎవిక్షన్ పాస్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. షాక్‌లో అర్జున్

by Disha Web Desk 7 |
ఎవిక్షన్ పాస్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. షాక్‌లో అర్జున్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఎంతో రసవత్తరంగా మారుతోంది. 10 వారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని 11వ వారంలోకి అడుగు పెట్టారు హౌస్ మేట్స్. ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే.. టాప్ టెన్ ర్యాంక్స్ ఇచ్చి ఇందులో ఎవరు ఏ ర్యాంకుకు అర్హులు అనుకుంటారో అందులో నిలబడాలిని సూచించాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ అభిప్రాయాల ప్రకారం.. వాదోపవాదనలు జరిగిన తర్వాత టాప్ 1లో శివాజీ, 2 ప్రిన్స్ యావర్, 3 పల్లవి ప్రశాంత్, 4 ప్రియాంక జైన్, 5 శోభశెట్టి, 6 అమర్ దీప్, 7 గౌతమ్, 8 అర్జున్, 9 అశ్విని, 10 రతిక నిలిచారు.

అయితే.. ఈ సారి ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి టాప్ 5 లో ఉన్నవారికి కాకుండా లీస్ట్‌లో అంటే 6 టూ 10 ర్యాంకుల్లో ఉన్నవారికి ఎవిక్షన్ పాస్ గెలుచుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఈ గేమ్‌లో గెలిచిన అర్జున్ ఎవిక్షన్ పాస్ గెలిచుకున్నాడు. ఇక్కడ అర్జున్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ ఎవిక్షన్ పాస్‌ను ప్రత్యర్థుల నుంచి డిఫైండ్ చేసుకోవాలని చెప్పాడు. ఈ రోజు ప్రోమో ప్రకారం.. టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవిక్షన్ పాస్ గురించి అర్జున్‌తో తలపడనున్నారు. మరి వారితో గెలిచి అర్జున్ ఎవిక్షన్ పాస్ గెలుచుకుంటాడా.. లేదా టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరో ఒకరు దాన్ని దక్కించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed